Home /News /coronavirus-latest-news /

Omicron: డేంజరస్ వైరస్.. 38 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. కానీ అదొక్కటే ఊరట..

Omicron: డేంజరస్ వైరస్.. 38 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. కానీ అదొక్కటే ఊరట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron Variant: డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌తో వచ్చే లక్షణాల తీవ్రత చాలా తక్కువ. ఆస్పత్రిలో చేరే ముప్పు కూడా తక్కువ. ఇంట్లోనే నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    ఒమిక్రాన్ వేరియెంట్ (Omicron variant) యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికా (South Africa) నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన ఈ  వైరస్.. ఇప్పుడు మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 38 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.  తాజాగా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. మనదేశంలో రెండు రోజుల క్రితం రెండు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. అతడు ఇప్పటికే నకిలీ కోవిడ్ సర్టిఫికెట్‌తో దేశం దాటి వెళ్లిపోయాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒమిక్రాన్ బాధితుడితో తీవ్రమైన లక్షణాలేవీ లేవని అధికారులు చెప్పారు. ఐతే ఒమిక్రాన్ 38 దేశాలకు వ్యాపించినప్పటికీ.. ఒక్క మరణం కూడా సంభవించలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది నిజంగా ఊరటనిచ్చే విషయం.

    Danger Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్..? కళాశాలలో కరోనా కలకలం.. 56 మంది విద్యార్థులకు కరోనా..

    ఒమిక్రాన్ వైరస్ మొట్ట మొదట దక్షిణాఫ్రికాలో బయటపడింది. నవంబరు 24న తొలి ఒమిక్రాన్ బాధితుడిని గుర్తించారు. ఐతే అంత కంటే ముందే ఇతర దేశాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ వచ్చి ఉండఉచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం సౌతాఫ్రికాలోనే మొదటి కేసు బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 674 ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 217 మంది బాధితులు ఉన్నారు. ఐతే మరో 38,173 మందికి కూడా సోకి ఉండవచ్చని చెబుతున్నారు. దక్షిణాఫ్రికా తర్వాత యూకేలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. యూకేలో ఇప్పటి వరకు 134 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. ఇక జింబాబ్వేలో 50, ఘనాలో 33, పోర్చుగల్‌లో 28, అమెరికలో 24, బోట్స్‌వానాలో 21, డెన్మార్క్ 18, నెదర్లాండ్స్ 16, కెనడా 16, నార్వే 15, ఆస్ట్రియా 14, జర్మనీ 12, సౌత్ కొరియా 9, హాంగ్ కాంగ్ 8, ఇజ్రాయెల్‌లో 7 కేసులున్నాయి.

    Omicron: ఒమిక్రాన్ వల్ల దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా ?.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

    ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న వేళ దాని లక్షణాలు, తీవ్రత గురించి చాలా మంది ఆందోళన చెందుతారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియెంట్‌ను గుర్తించిన సౌతాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కొయెట్జీ క్లారిటీ ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో తీవ్రమైన జబ్బు లక్షణాలు ఉండవని ఆమె చెప్పారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలుంటాయి. ఐతే గతంలో మాదిరి వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవు. ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైన జ్వరం కూడా ఉండవని ఆమె పేర్కొన్నారు.

    Omicron Tension: ఆ 30 మందిపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లు ఎక్కడున్నారంటే..

    డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌తో వచ్చే లక్షణాల తీవ్రత చాలా తక్కువ. ఆస్పత్రిలో చేరే ముప్పు కూడా తక్కువ. ఇంట్లోనే నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది యువతపై ప్రభావం చూపిస్తోంది. రెండు డోసుల కరోనా టీకాలు వేసుకున్న వాళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఐతే వ్యాక్సిన్ వేసుకున్న వారికి అది సోకినా... టీకా వేసుకోని వాళ్లతో పోలిస్తే రక్షణ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీకాలు వేయించుకోకుంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. లక్షణాల తీవ్రత మాత్రం తక్కువేనని చెబుతున్నారు. ఐనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Omicron, Omicron corona variant

    తదుపరి వార్తలు