HOME »NEWS »Corona vilayatandavam »coronavirus updates karnataka imposes night curfew as new strain found in uk sk

కర్నాటకలో కర్ఫ్యూ విధింపు.. అన్ని వేడుకలూ రద్దు.. కరోనా 2.0 టెన్షన్

కర్నాటకలో కర్ఫ్యూ విధింపు.. అన్ని వేడుకలూ రద్దు.. కరోనా 2.0 టెన్షన్
ప్రతీకాత్మక చిత్రం

Night Curfew in karnataka: ఇవాళ రాత్రి నుంచి జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు అత్యవసర సేవలకు మినహా ఎలాంటి కార్యకర్యకలాపాలకు అనుమతిలేదు. కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరూ బయట తిరగకూడదు.

  • Share this:
    యావత్ ప్రపంచానికి మళ్లీ కరోనా టెన్షన్ పట్టుకుంది. యూకేలో ఉత్పరివర్తనం చెందిన (Mutated) కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఈ మ్యుటేటెడ్ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలూ అప్రమత్తమయ్యి. బ్రిటన్‌ నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాయి. భారత్, ఈయూతో పాటు ఇప్పటి చాలాదేశాలు యునైటెడ్ కింగ్‌డమ్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇటీవల యూకే నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.

    ఇవాళ రాత్రి నుంచి జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు అత్యవసర సేవలకు మినహా ఎలాంటి కార్యకర్యకలాపాలకు అనుమతిలేదు. కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరూ బయట తిరగకూడదు. క్రిస్‌మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పైగా కర్నాటక ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. రాత్రి 10 తర్వాత ఎలాంటి వేడుకలకూ అనుమతి లేదని స్పష్టం చేసింది. యూకేలో కరోనా కొత్తరకం వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరోనానను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.



    యూకే నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టిసారించి పరీక్షలు చేస్తున్నామని.. పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు, నెగెటివ్ వచ్చినా క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు కర్నాటక అధికారులు పేర్కొన్నారు.

    మనదేశంలో మహారాష్ట్ర తర్వాత కర్నాటకలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,185 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్‌తో బాధపడుతూ మరో 11 మంది మరణించారు. తాజా లెక్కలతో కర్నాటకలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 9,03,425కి చేరింది. వీరిలో కరోనా నుంచి ఇప్పటికే 8,75,796 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 11,965 మంది మరణించారు. ప్రస్తుతం కర్నాటకలో 15,645 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ఐతే యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కర్నాటకలో నైట్ కర్ఫ్యూ విధించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:December 23, 2020, 13:45 IST