ఇండియాలో కోటికి పైగా కరోనా టెస్టులు... జోరు పెంచాలంటున్న నిపుణులు...

ప్రస్తుతం ఇండియాలో రోజూ 2 లక్షలకు పైగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి. అవి ఏమాత్రం సరిపోవంటున్నారు నిపుణులు.

news18-telugu
Updated: July 8, 2020, 7:55 AM IST
ఇండియాలో కోటికి పైగా కరోనా టెస్టులు... జోరు పెంచాలంటున్న నిపుణులు...
ఇండియాలో కోటికి పైగా కరోనా టెస్టులు... జోరు పెంచాలంటున్న నిపుణులు... (credit - twitter - reuters)
  • Share this:
మంగళవారం ముంబై నగరం ఓ రికార్డ్ సృష్టించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దేశంలోనే తొలిసారిగా కరోనా టెస్టు ముంబైలో నిర్వహించారు. ఇప్పటివరకూ కరోనా టెస్ట్ చెయ్యాలంటే... డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా చూసేవాళ్లు. ముంబైలో జరిగింది చాలా మంది పని అంటున్న నిపుణులు... దేశవ్యాప్తంగా అలా చెయ్యాలనీ... ఆలస్యం చెయ్యకుండా... టెస్టుల సంఖ్యను బాగా పెంచాలని కోరుతున్నారు. ఇండియాలో కరోనా కంట్రోల్‌లోకి రావాలంటే... ఎక్కువ టెస్టులు చెయ్యడమే సరైన మార్గం అంటున్నారు. ఇండియాలో మొన్నటికి కోటి టెస్టులు దాటాయి. రోజూ 2 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయి. నిపుణులు మాత్రం ఆగస్ట్ 15 నాటికి దేశంలో 5 కోట్ల మందికి టెస్టులు పూర్తవ్వాలని అంటున్నారు. అలా జరిగితేనే... వైరస్ వ్యాప్తి ఎలా ఉందో, ఎంతలా ఉందో తెలుస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసుల్లో ఇండియాది మూడోస్థానం. రోజువారీ కేసుల్లోనూ భారత్ 3వ స్థానంలోనే ఉంది. రోజువారీ మరణాల్లో ఇండియా... బ్రెజిల్, అమెరికా, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా... 8వ స్థానంలో ఉంది. ఇండియాలో తాజాగా 22252 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 719665కి చేరింది. అలాగే... 467 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 20160కి చేరింది. ప్రస్తుతం దేశంలో నిన్న ఒక్క రోజే 15515 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 439947కి పెరిగింది. అలాగే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 259557 ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో... ప్రతి 10 లక్షల మందిలో 7661 మందికి మాత్రమే కరోనా టెస్టులు జరిగాయి. అంటే దేశ జనాభాతో పోల్చితే ఇది 0.8 శాతం కంటే తక్కువే. అమెరికాలో అక్కడి జనాభాతో పోల్చితే టెస్టుల సంఖ్య 11 శాతంగా ఉంది. రష్యాలో అది 16 శాతంగా, బ్రిటన్‌లో 15 శాతంగా ఉంది.

ఇప్పటికే ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలతోపాటూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. టెస్టులు ఎక్కువగా చేస్తూ... కరోనా పాజిటివ్ ఉన్నవారిని... ఇతరులకు దూరంగా ఉంచినప్పుడే... ఈ చైన్‌కి బ్రేక్ వెయ్యగలమని నిపుణులు అంటున్నారు. ఎక్కువ టెస్టులు చెయ్యడం వల్ల... ఎక్కువ మంది పాజిటివ్‌లను కనిపెట్టి... వారిని మిగతా ప్రజల నుంచి వేరు చేయగలం అని చెబుతున్నారు. అందరికీ టెస్టులు చెయ్యడం కష్టం కాబట్టి... కనీసం టెస్టుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 8, 2020, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading