Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS UPDATES INDIA SEES SLIGHT RISE IN DAILY CASES 9765 NEW CASES REPORTED SK

India Corona Updates: ఒమిక్రాన్ టెన్షన్ వేళ భారత్‌లో పెరిగిన కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Corona cases: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ టెన్షన్ పెడుతున్న వేళ.. భారత్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
    india corona cases today, india corona news, india coronavirus, india corona cases, india corona, india coronavirus cases, india corona update
    India Corona cases: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి బులెటిన్‌లో 8,954 కరోనా కేసులు రాగా.. ఇవాళ్టి బులెటిన్‌లో మాత్రం ఏకంగా 9,765 కేసులు వచ్చాయి. అంటే దాదాపు 800 కేసులు పెరిగాయి. కొత్తగా 477 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి 8548 మంది కోలుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)


    coronavirus, corona cases in india, corona cases in telangana, coronavirus india, corona update, covid vaccine, covid cases in india, delta variant, covid-19 india, corona cases in telangana, corona update hyderabad, కరోనా కేసులు, కరోనా వ్యాక్సిన్,
    తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,06,541 కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,40,37,054 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,69,724 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 99,763 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    poonam khetrapal singh on coronavirus, poonam khetrapal singh comments, coronavirus latest news, covid19 latest updates, who on covid19, corona third wave news, కరోనాపై డబ్ల్యూహెచ్‌వో తాజా వ్యాఖ్యలు, పూనమ్ ఖేత్రపాల్ సింగ్
    నిన్నటి వరకు కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ఒమిక్రాన్ విజృంభిస్తున్న సమయంలోనే కేసలు పెరగడం టెన్షన్ రేపుతోంది. మరోవైపు 16 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    నిన్న కేరళలో 5,405 కేసులు నమోదయ్యాయి. 403 మంది మరణించారు. ఇందులో బ్యాక్‌లాగ్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. కేరళ కొన్ని రోజులుగా బ్యాక్ లాక్ మరణాలపై దృష్టిపెట్టడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక మహారాష్ట్రలో 903, తమిళనాడులో 751 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    నిన్నటితో పోల్చితే ఇవాళ టెస్ట్ పాజిటివిటీ రేటు పెరిగింది. నిన్నటి బులెటిన్‌లో 0.81 శాతంగా ఉండగా..ఇవాళ 0.91శాతంగా ఉంది. మిజోరాం (10.42 %), కేరళ (8.60%), సిక్కింలో(3.37)లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది.


    భారత్‌లో నిన్న 10,98,611 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 64.35 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 80,35,261 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 124.96 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

    రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona bulletin, Coronavirus, Covid-19, Omicron, Omicron corona variant

    తదుపరి వార్తలు