దేశంలో జోరుగా కరోనా... ఏడున్నర లక్షలకు చేరువలో కేసులు... తాజాగా ఎన్నంటే...

ఐదు నెలల కిందట ఇండియాలో కరోనా కేసులు చాలా చాలా తక్కువ. మరి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

news18-telugu
Updated: July 8, 2020, 10:04 AM IST
దేశంలో జోరుగా కరోనా... ఏడున్నర లక్షలకు చేరువలో కేసులు... తాజాగా ఎన్నంటే...
దేశంలో జోరుగా కరోనా... ఏడున్నర లక్షలకు చేరువలో కేసులు... (credit - NIAID)
  • Share this:
ఇండియాలో కరోనా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా... 22752 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 742417కి చేరింది. అలాగే... తాజాగా 482 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 20642కి చేరింది. తాజాగా... 16883 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 456830కి చేరింది. అలాగే... ప్రస్తుతం 264944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాస్త ఉపశమనం కలిగించే విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి... దేశంలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగి... 61.5కి చేరింది. అలాగే... మరణాల రేటు ప్రపంచంలో 7 శాతం ఉండగా... ఇండియాలో అది 2.8 శాతంగా ఉంది. షాకింగ్ విషయమేంటంటే... ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ఇండియా అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడోస్థానంలో ఉంది. రోజువారీ కేసుల్లోనూ భారత్ 3వ స్థానంలోనే ఉంది. రోజువారీ మరణాల్లో డియా... బ్రెజిల్, అమెరికా, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా... 8వ స్థానంలో ఉంది.

ఇండియాలో ఫిబ్రవరి 15న తొలిసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు కేరళలో వచ్చాయి. మార్చి 24 నాటికి అవి 500 దాటాయి. మార్చి 29కే వెయ్యి కేసులు దాటాయి. మే 6కి 50వేల కేసులు దాటాయి. మే 18 నాటికి లక్ష కేసులు దాటి... 100328 నమోదయ్యాయి. జూన్ 2కి రెండు లక్షల కేసులు దాటాయి. జూన్ 12కి మూడు లక్షల కేసులు దాటాయి. జూన్ 20 నాటికి 4 లక్షల కేసులు దాటగా... జూన్ 26న 5 లక్షల కేసులు దాటాయి. జూలై 1న 6 లక్షల కేసులు దాటగా... జులై 6న ఏడు లక్షల కేసులు దాటాయి.

నిన్న దేశంలో 2.62 లక్షల టెస్టులు చెయ్యడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 10473771కి చేరింది. ఇండియాలో ఒకే రోజు 2.5 లక్షల టెస్టులు చెయ్యడం ఇదే తొలిసారి. 7 రాష్ట్రాల్లో రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మాత్రం రోజువారీ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. నిన్న 2008 కేసులు రాగా... రికవరీలు 2129 ఉన్నాయి. తమిళనాడులో కూడా నిన్న 3616 కేసులు రాగా... రికవరీలు 4545 ఉన్నాయి. తమిళనాడు రికవరీ రేటు 60 శాతంగా ఉంది. ఇప్పుడు దక్షిణ అమెరికా, యూరప్ కంటే ఆసియాలో ఎక్కువ కేసులున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 21 దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులున్నాయి.

దేశంలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
Published by: Krishna Kumar N
First published: July 8, 2020, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading