పసుపుతో అమూల్ ఐస్‌క్రీమ్... టేస్ట్ ఎలా ఉంది... నెటిజన్లు ఏమన్నారంటే...

Coronavirus updates : ఈ కరోనా వచ్చాక... ఎవరు ఏం చేసినా... దానికి సంబంధించినవే చేస్తున్నారు. అమూల్ కూడా కరోనాకి చెక్ పెట్టేలా ఐస్‌క్రీమ్ చేసింది.

news18-telugu
Updated: August 2, 2020, 10:37 AM IST
పసుపుతో అమూల్ ఐస్‌క్రీమ్... టేస్ట్ ఎలా ఉంది... నెటిజన్లు ఏమన్నారంటే...
పసుపుతో అమూల్ ఐస్‌క్రీమ్... టేస్ట్ ఎలా ఉంది... (credit - twitter)
  • Share this:
కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే... చల్లటి డ్రింక్స్, ఐస్‌క్రీమ్ వంటివి తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ బ్రాండ్ అమూల్... వ్యాధి నిరోధక శక్తిని పెంచే అల్లం, తులసి, పసుపు వంటివి వాడి ప్రత్యేక ఉత్పత్తుల్ని రిలీజ్ చేస్తోంది. వాటిలో ఒకటు పసుపుతో చేసిన ఐస్‌క్రీమ్. కరోనాకి చెక్ పెట్టాలనుకునేవారు... ఈ ఐస్‌క్రీమ్ తింటే... వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. ఐతే... దీన్ని పూర్తిగా పసుపుతోనే తయారుచెయ్యలేదు. ఇందులో పాలు, తేనె, మిరియాల పొడి, ఖర్జూరాలు, బాదం, జీడిపప్పు కూడా వేసినట్లు అమూల్ కంపెనీ... ట్విట్టర్‌లోని తన ఖాతాలో తెలిపింది. దీనితోపాటూ... అల్లం ఐస్‌క్రీమ్, తులసి ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ కూడా తయారుచేసినట్లు తెలిపింది.


ఈమధ్య చవన్‌ప్రాష్ ఐస్‌క్రీమ్ కూడా వచ్చింది. ఇలా చాలా కంపెనీలు... తమ ఉత్పత్తులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాల్ని కలుపుతున్నాయి. పాలు, పసుపు అనేది మంచి కాంబినేషనే. కానీ నెటిజన్లు మాత్రం ఈ ఐస్‌క్రీమ్‌పై భిన్నంగా స్పందిస్తున్నా్రు. ఇదేం ఐస్‌క్రీమ్ అంటున్నారు. ఇది కర్రీయా, ఐస్‌క్రీమా అని అడుగుతున్నారు. మరీ ఇంత క్రియేటివిటీ వద్దని మరో నెటిజన్ కామెంట్ చేశారు. "కొత్త ఫ్లేవర్లు ట్రై చెయ్యడం నాకు ఇష్టమే. అమూల్ నన్ను డిజప్పాయింట్ చెయ్యదనే అనుకుంటున్నాను" అని మరో యూజర్ తెలిపారు.


అమూల్‌కి సహజంగానే మొదటి నుంచి నెటిజన్లు సపోర్ట్ ఇస్తున్నారు. చైనా-భారత్ మధ్య ఈ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు అమూల్ చైనాకి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు పెట్టింది. ఆ సందర్భంగా ట్విట్టర్ అమూల్ అకౌంట్‌ను సస్పెండ్ చేసినప్పుడు నెటిజన్లు ట్విట్టర్‌పై ఫైర్ అయ్యారు. దాంతో... ట్విట్టర్ దారికొచ్చి... అమూల్‌ అకౌంట్‌పై సస్పెన్షన్ రద్దు చేసుకుంది. అలాంటి నెటిజన్లు... ఈ పసుపు ఐస్‌క్రీమ్‌పై మాత్రం అంతగా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నట్లు కనిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading