• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • CORONAVIRUS UPDATES FORMER DELHI MLA JITENDER SINGH SHUNTY FACILITATING CREMATION OF COVID VICTIMS IN DELHI SK GH

కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే.. సరిలేరు మీకెవ్వరు

కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే.. సరిలేరు మీకెవ్వరు

ప్రతీకాత్మక చిత్రం

ఒక్క గురువారం రోజే 33 మంది వ్యక్తులను అంత్యక్రియలకు జితేందర్ సింగ్ బృందం రవాణా చేసింది. సామాజిక సేవలో ఈ ఏడాది ఆయన పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు.

  • Share this:
రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇలా కరోనా కారణంగా మరణించిన వారి అంత్యక్రియలకు సహాయం చేస్తున్నారు దిల్లీ మాజీ ఎంఎల్ఏ జితేందర్ సింగ్ షంటీ. దాదాపు ఏడాది తర్వాత తన సాంఘీక సామాజిక సేవా సంస్థ షాహిద్ భగత్ సింగ్ సేవా దళ్(SBSSD) ద్వారా కరోనాతో మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా భయంతో కుటుంబ సభ్యులు ముందుకు రాని మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.


ఢిల్లీలోని షాదారా ఎంఎల్ఏగా పనిచేసి జితేందర్ సింగ్.. SBSSDని స్థాపించారు. ఇందులో రెండు డజన్లు వాలంటీర్లు పనిచేస్తుండగా.. 18కి పైగా వ్యాన్లు, అంబులెన్సులు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మంది కరోనా రోగులకు రవాణా సాయం అందిస్తున్నారు. ఇలా దాదాపు 300 మృతదేహాలకు వారి కుటుంబ సభ్యులకు దూరంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.



జితేందర్ సింగ్





"గతేడాది ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పటి నుంచి 1054 మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించాం. కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉన్న కారణంగా 296 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించాం. వీరిలో చాలా మంది మృతదేహాన్ని స్వీకరించేందుకు ముందుకు రాలేదు. మేము వారి మత, ధార్మిక విశ్వాసాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం" అని ఆయన అన్నారు. ఒక్క గురువారం రోజే 33 మంది వ్యక్తులను అంత్యక్రియలకు ఆయన బృందం రవాణా చేసింది. సామాజిక సేవలో ఈ ఏడాది ఆయన పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కరోనా మరింత ప్రమాదకరంగా ఉందని అన్నారు.

"గతేడాది మేము దహనం చేసిన మృతదేహాలు ఎక్కువగా వృద్ధులవి, కానీ ప్రస్తుతం ఎక్కువగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే 14 ఏళ్ల బాలుడు, 20 ఏళ్ల అమ్మాయి మృతదేహాలను ఖననం చేశాం. ఇది షాకింగ్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం యువకులు ఎక్కువగా వైరస్ బారిన పడటం బాధాకరంగా ఉంది" అని జితేందర్ సింగ్ షంటీ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించి మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులు దగ్గర లేనప్పుడు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. గతేడాది ఈ దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు తన కుటుంబం కూడా కరోనా బారిన పడిందని తెలిపారు.


"గతేడాది నా భార్యతో పాటు 26, 34 ఏళ్ల వయసున్న ఇద్దరు కూమారులు కూడా కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ ఇతరులకు సేవ చేయాలనే అంకితభావంతో ముందుకు వెళ్లి కరోనాను జయించాం" అని ఆయన అన్నారు. జీతేందర్ సింగ్ షంటీ సంస్థ అయిన SBSSD దిల్లీలోని ట్రాన్స్-యమునా ఏరియా,తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఆయా జిల్లా అధికారులతో కలిసి పనిచేస్తుంది. ఫలితంగా లబ్దిదారులతో పాటు ప్రభుత్వ అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: