భారత్‌లో కరోనా విజృంభణ... 20వేలు దాటిన మరణాలు... కొత్త కేసులు ఎన్నంటే...

ఇండియాలో కరోనా వైరస్ ఇప్పుడు జోరుగా ఉంది. ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ప్రపంచంలో రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ సెకండ్ పొజిషన్‌కి చేరింది.

news18-telugu
Updated: July 7, 2020, 9:58 AM IST
భారత్‌లో కరోనా విజృంభణ... 20వేలు దాటిన మరణాలు... కొత్త కేసులు ఎన్నంటే...
భారత్‌లో కరోనా విజృంభణ... 20వేలు దాటిన మరణాలు... (credit - NIAID)
  • Share this:
ఇండియాలో రోజూ 20వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 22252 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 719665కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 467 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 20160కి చేరింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 8 శాతంగా ఉండగా... ఇండియాలో అది 2.8 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో నిన్న ఒక్క రోజే 15515 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 439947కి పెరిగింది. అలాగే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 259557 ఉన్నాయి.

ప్రపంచంతో పోల్చితే... ఇండియాలో మొత్తం కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఇండియా... అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడోస్థానంలో ఉంది. ఇండియాలో టెస్టుల సంఖ్య పెంచుతుండటం కూడా ఇందుకు కారణమవుతోంది. నిన్న 241430 టెస్టులు చెయ్యడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 10211092కి పెరిగింది.

ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం కేసుల్లో ఇండియా... మూ‌డో స్థానంలో ఉండగా... రోజువారీ కేసుల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే... రోజువారీ మరణాల్లో భారత్... రెండో స్థానంలో ఉండగా... మొత్తం మరణాల్లో ఇండియా... రోజూలాగే 8వ స్థానంలో ఉంది. ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉండటం మనకు ఒకింత ఊరట కలిగించే అంశం.

ప్రస్తుతం దేశంలో ఢిల్లీలో... కరోనా రికవరీలు బాగా పెరుగుతున్నాయి. ఐతే... ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివ్ కేసులు లక్షకు పైగా ఉన్నాయి. మొన్నటితో పోల్చితే రికవరీలు కాస్త తగ్గాయి. కర్ణాటకలో మొత్తం కేసులు 25వేలు దాటాయి. ప్రపంచంలో ప్రతి 10 లక్షల మందిలో 1506 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1831 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1419 ఉండటం హైదరాబాద్‌లో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25733కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 306కు చేరింది. కొత్తగా 2078 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 14781కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10646గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1322 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 56 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20019 దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో ఇప్పటివరకు కోవిడ్ 19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 8290కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 239కి చేరింది. గడిచిన 24 గంటల్లో చేసిన 16712 కరోనా పరీక్షలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు 1033852 కోవిడ్ 19 టెస్టులు నిర్వహించారు.

corona drug, corona vaccine, unlock2, lockdown6, extend the lockdown, corona update, fight with corona virus, covid19, కరోనా డ్రగ్, కరోనా మందు, కరోనా వ్యాక్సిన్, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్2,
ఇండియాలో కరోనా కేసుల వివరాలు
ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
Published by: Krishna Kumar N
First published: July 7, 2020, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading