ఇండియాలో కరోనా కల్లోలం... 8 లక్షలు దాటిన కేసులు... తాజాగా ఎన్నంటే...

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డులు తిరగరాస్తోంది.

news18-telugu
Updated: July 11, 2020, 10:17 AM IST
ఇండియాలో కరోనా కల్లోలం... 8 లక్షలు దాటిన కేసులు... తాజాగా ఎన్నంటే...
ఇండియాలో కరోనా కల్లోలం... 8 లక్షలు దాటిన కేసులు... తాజాగా ఎన్నంటే...(credit - NIAID)
  • Share this:
ఇండియాలో కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చేస్తోందనీ... రికవరీలు పెరిగిపోతున్నాయనీ... అందువల్ల టెన్షన్ అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో... రోజు వారీ నమోదవుతున్న కేసులు భారీగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమే. తాజాగా... ఒకే రోజున ఏకంగా... 27వేలకు పైగా కేసులు నమోదవ్వడం సాధారణ విషయం కాదు. ఇంతభారీగా కేసులు రావడం ఇదే తొలిసారి. చూస్తుండగానే... ఇండియాలో మొత్తం కరోనా కేసులు 8లక్షలు దాటేశాయి. రోజురోజుకూ... వేల మంది వైరస్ బారిన పడుతుంటే... వాళ్లకు ట్రీట్‌మెంట్ చెయ్యడం డాక్టర్లకు అతి పెద్ద సమస్యగా మారుతోంది. ఇళ్లలోనే ఉండి ట్రీట్‌మెంట్ చేయిస్తున్నా... కేసుల జోరు కారణంగా... డాక్టర్లపై ఒత్తిడి బాగా పెరుగుతోంది.

తాజాగా ఇండియాలో ఒక్క రోజులో... 27114 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 820916కి చేరింది. అలాగే... ఒక్క రోజులో దేశంలో... 519 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 22123కి చేరింది. తాజాగా 19874 మంది డిశ్చార్జి అవ్వడంతో... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 515386కి చేరింది. ప్రస్తుతం దేశంలో 283407 యాక్టివ్ కేసులున్నాయి.

అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇప్పుడు ఇండియాలోనే రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో కూడా భారత్ మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్ 4లో ఉండగా... మొత్తం మరణాల్లో నెల నుంచి 8వ స్థానంలోనే ఉంది.

తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కి పెరిగింది. ఇక 8 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 339కి చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 762 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత రంగారెడ్డి (171), మేడ్చల్ (85), సంగారెడ్డి (36), కామారెడ్డి (23), మెదక్ (22), ఖమ్మం (18), నల్లగొండ (32), ఆదిలాబాద్ 14, సూర్యాపేట (14) కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 1608 పాజిటివ్ కేసులొచ్చాయి. వీటితోకలిపి ఇప్పటిదాకా 25422 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ సోకి 15 మంది ప్రాణాలు విడిచారు. ఈ మృతుల్లో చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీలో 13,194 మంది డిశ్చార్జి కాగా, 11,936 మంది పలు ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 10:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading