కరోనా తక్కువది కాదు... ప్రభావం దశాబ్దాలు ఉంటుంది... WHO హెచ్చరిక

Coronavirus updates : ప్రపంచ దేశాలేమో ఈ నెలలో వ్యాక్సిన్ వచ్చేస్తుందని ఆశగా ఉన్నాయి. WHO మాత్రం కరోనా అంత త్వరగా వదలదంటోంది.

news18-telugu
Updated: August 1, 2020, 8:42 AM IST
కరోనా తక్కువది కాదు... ప్రభావం దశాబ్దాలు ఉంటుంది... WHO హెచ్చరిక
కరోనా తక్కువది కాదు... ప్రభావం దశాబ్దాలు ఉంటుంది... WHO హెచ్చరిక (credit - twitter)
  • Share this:
Coronavirus updates : ఆగస్ట్ 1 రాగానే ప్రపంచ దేశాలన్నీ... ఇక కరోనా పని అయిపోయినట్లే అనుకుంటున్నాయి. ఎందుకంటే... ఈ నెలలో దాదాపు మూడు వ్యాక్సిన్లు వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తుంటే... ప్రపంచ దేశాలన్నీ... ఈ నెల నుంచి కరోనాపై మనదే విజయం అవుతుంది అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం... మరోలా చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.77 కోట్ల పాజిటివ్ కేసుల్ని తెప్పించిన కరోనాను ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కరోనా వచ్చి ఏడు నెలలు అయ్యిందనీ... దాని జోరు తగ్గకపోగా పెరిగిందని WHO ఆందోళన చెందుతోంది.


శతాబ్దం కిందట 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కంటే... కరోనా వైరస్ తక్కువేమీ కాదనీ, వందేళ్ల తర్వాత వచ్చిన ఈ వైరస్... అంత త్వరగా వదిలేసే ఛాన్స్ లేదని WHO హెచ్చరిస్తోంది. చాలా మంది త్వరలోనే వైరస్ అంతమైపోతుందని అనుకుంటున్నారనీ... కానీ వైరస్ ప్రభావం కొన్ని దశాబ్దాలపాటూ ఉంటుందని WHO చెప్పడం మరో షాకింగ్ విషయం. ఆరు నెలలుగా కరోనా కేసుల్ని పరిశీలించిన తర్వాత తమ ఎమర్జెన్సీ కమిటీ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు WHO చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు. "ఆరు నెలల కిందట 100 కంటే తక్కువ కేసులున్నాయి. చైనా బయట మరణాలే లేవు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే 6.82 లక్షల మంది చనిపోయారు." అని టెడ్రోస్ అన్నారు.

టెడ్రోస్ అన్నట్లుగానే... చైనానే తీసుకుంటే అక్కడ కరోనా వైరస్ మళ్లీ పెరుగుతోంది. నిన్న 127 కొత్త కేసులు వచ్చాయి. 105 కేసులు వచ్చాయి. ఇవాళ ఇప్పటికే 45 వచ్చాయి. అంటే ఈ రోజు పూర్తయ్యే సరికి మరో వందకు పైగా వచ్చేలా ఉన్నాయి. ఇది వరకు వుహాన్ నగరానికే పరిమితమైన కేసులు ఇప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో వస్తున్నాయి. దానర్థం చైనాలో సెకండ్ వేవ్ మొదలైనట్లే. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో చెప్పలేం. ఎందుకంటే వుహాన్ నగరాన్ని కంట్రోల్ చేసినట్లుగా... చైనా దేశం మొత్తాన్నీ కంట్రోల్ చెయ్యడం కష్టం. అందువల్ల అక్కడ మళ్లీ కరోనా జోరందుకునే ప్రమాదం కనిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading