హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Amarnath Yatra: కరోనా ఎఫెక్ట్.. అమర్‌నాథ్ యాత్ర రద్దు

Amarnath Yatra: కరోనా ఎఫెక్ట్.. అమర్‌నాథ్ యాత్ర రద్దు

అమర్‌నాథ్ మంచు లింగం (ఫైట్ ఫొటో)

అమర్‌నాథ్ మంచు లింగం (ఫైట్ ఫొటో)

జమ్మూకశ్మీర్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకాశ్మీర్, లద్దాఖ్)గా విడిపోయిన తర్వాత.. తొలిసారి జరుగుతున్న అమర్‌నాథ్ యాత్ర కరోనా కారణంగా రద్దయింది.

  అమర్‌నాథ్ యాత్ర ఉంటుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ వచ్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర రద్దయింది. ఈ మేరకు శ్రీ అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు (SASB) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ రాజ్‌భవన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బేస్ క్యాంపుల నిర్వహణ, మంచు తొలగించడం, భక్తులకు వైద్య సదుపాయాలు వంటివి కల్పించలేమని SASB తెలిపింది. శివ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

  ఐతే అమర్‌నాథ్ గుహలో శివలింగానికి ప్రాతం పూజ, సంపన్న్ పూజ మాత్రం సంప్రదాయబద్ధంగా కొనసాగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివుడి భక్తుల కోసం మంచులింగ దర్శనాన్ని ఆన్‌లైన్, మీడియా ద్వారా ప్రసారం చేస్తారు.


  కరోనా నేపథ్యంలో యాత్రను కుదిరించి.. జూలై 21 నుంచి ఆగస్టు 3 రెండు వారాల పాటు నిర్వహించాలని ఇటీవల SASB నిర్ణయించింది. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఐతే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. 2 వారాలు కాదు మొత్తానికే యాత్రను రద్దుచేసింది. గత ఏడాది ఆర్టికల్ 370 నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను మధ్యలోనే నిలిపివేసింది కేంద్రం. ఇక జమ్మూకశ్మీర్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకాశ్మీర్, లద్దాఖ్)గా విడిపోయిన తర్వాత.. తొలిసారి జరుగుతున్న అమర్‌నాథ్ యాత్ర కరోనా కారణంగా రద్దయింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amarnath Yatra, Coronavirus, Covid-19, Jammu and Kashmir

  ఉత్తమ కథలు