జైల్లో కలకలం... 75 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్... ఎలా సోకిందంటే...

Coronavirus updates : మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉందనేందుకు ఇదో ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అంత మందికి ఎలా సోకిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 2, 2020, 7:57 AM IST
జైల్లో కలకలం... 75 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్... ఎలా సోకిందంటే...
జైల్లో కలకలం... 75 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్... ఎలా సోకిందంటే...
  • Share this:
Coronavirus updates : అది ఆంధ్రప్రదేశ్... నెల్లూరు జిల్లా జైలు. పది రోజుల కిందట... ఓ ఖైదీ దగ్గడం మొదలుపెట్టాడు. పక్కనున్న మరో ఖైదీ అనుమానంగా చూశాడు. అప్పుడా దగ్గుతున్న ఖైదీ "ఏంటలా చూస్తున్నావ్... కరోనా వచ్చిందనుకుంటున్నావా... అంత లేదు... మొన్న చికెన్ కర్రీ పెట్టారుగా... అందులో మసాలా ఎక్కువైంది. వేడి చేసి దగ్గు వస్తోంది" అన్నాడు. అయినప్పటికీ తోటి ఖైదీ అనుమానంగానే చూడసాగాడు. ఆ దగ్గు క్రమంగా పెరగసాగింది. గొంతులో ఏదో అడ్డుపడుతున్న ఫీలింగ్. పక్క నున్న ఖైదీ... పనుందంటూ అక్కడి నుంచి బయల్దేరాడు. కొంత దూరంగా వెళ్లి... జైలు గేటు దగ్గరున్న ఓ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఆ కానిస్టేబుల్ వెంటనే తన మాస్కును సరిగా సెట్ చేసుకున్నాడు. పావు గంట తర్వాత... PPEలతో ముగ్గురు డాక్టర్లు వచ్చారు. మిగతా ఖైదీలను దూరంగా పంపి... ఆ దగ్గుతున్న ఖైదీకి టెస్ట్ చేశారు. ఓ గంట తర్వాత... అతనికి కరోనా సోకిందని చెప్పారు. అంతే... పక్కన కూర్చున్న ఖైదీకి చెమటలు పట్టాయి.

మూడ్రోజులుగా ఆ దగ్గుతున్న ఖైదీతో ఎవరెవరు ఉన్నారో... వాళ్లందరికీ టెస్టులు చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. అలా మొదలైన కరోనా వైరస్... రోజురోజుకూ ఆ జైల్లో పెరుగుతూనే ఉంది. అందులో మొత్తం 450 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 75 మందికి ఇప్పటికే కరోనా సోకింది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు... ఆరోగ్యం సరిగా లేని ఖైదీలను ఆస్పత్రికి తరలించారు. అలాగే... చాలా మందిని జైల్లోనే క్వారంటైన్ చేశారు. ఏం చేసినా... ఆల్రెడీ జైల్లో దూరిన వైరస్... వన్ బై వన్ పట్టుకుంటూనే ఉంది.

నెల్లూరు జిల్లాలో రోజురోజుకీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8578. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5783గా ఉండ‌గా... 2795 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 115గా ఉంది.

నెల్లూరు జిల్లాలో కోవిడ్ వార్డులు, కోవిడ్ సెంట‌ర్లలో 3134 బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1791 బెడ్స్‌పై క‌రోనా బాధితులు ఉన్నారు. కరోనా కంట్రోల్‌లో భాగంగా... నెల్లూరు సిటీలో ఆదివారం మాంసపు దుకాణాల్ని తెరవనివ్వలేదు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading