ఇండియాను కుదిపేస్తున్న కరోనా వైరస్... 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు...

దేశంలో రోజురోజుకూ కరోనా విస్తృతి పెరుగుతోంది. ఇదివరకు లేని ప్రాంతాల్లోకి కూడా ఇప్పుడు కరోనా వ్యాపిస్తోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

news18-telugu
Updated: June 27, 2020, 9:47 AM IST
ఇండియాను కుదిపేస్తున్న కరోనా వైరస్... 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు...
ఇండియాను కుదిపేస్తున్న కరోనా వైరస్... 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు...
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా 18552 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటి... 508953కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో 384 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 15685కి పెరిగింది. తాజాగా... 10244 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అందువల్ల మొత్తం కోలుకున్న వారి సంఖ్య 295880గా ఉంది. ఫలితంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 179387గా ఉంది. ఐతే... ఇండియాలో... రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా అది 58.1గా ఉండటం శుభసూచకం. ఐతే... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటింగ్ 9 శాతంగా ఉండగా... ఇండియాలో అది 3.1 శాతంగా ఉంది. ఇది కూడా కాస్త ఉపశమనమే. కాకపోతే... మొత్తం కేసుల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం.

తాజాగా జూన్ 26న 220479 మందికి కరోనా శాంపిల్ టెస్టులు చేశారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 7996707కి పెరిగింది. మన దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 8.41 శాతంగా ఉంటోంది. దీన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ప్రస్తుతం టెస్టుల సంఖ్య పెంచడం వల్లే... కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం రోజువారీ కొత్త కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉంది. మొత్తం మరణాల్లో టాప్ 8లో ఉండగా... రోజువారీ కొత్త మరణాల్లో ఇండియా టాప్ 4లో ఉంది.

దేశంలో కరోనా కేసుల వివరాలు
First published: June 27, 2020, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading