news18-telugu
Updated: July 20, 2020, 12:38 PM IST
కరోనా కాలం... అంత్యక్రియలకు అష్టకష్టాలు... చివరకు ఏం చేశారంటే...
కరోనా వ్యాధి సోకడం సంగతేమోగానీ... కరోనా వల్ల ఎవరైనా చనిపోతో మాత్రం... ఆ మరణం అత్యంత విషాదబరితం అవుతోంది. చాలా మంది అయిన వాళ్ల కడసారి చూపు లేకుండానే మట్టిలో కలిసిపోతున్నారు. మరికొందరు అందరూ ఉండి కూడా అనాథ శవం అవుతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో... అంతిమ సంస్కారాలు జరగకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇలా... కరోనా వైరస్... ప్రజల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ప్రజల భయం ప్రజలది. ఎక్కడ తమ ప్రాంతంలో కరోనా సోకుతుందో అనే భయంతో వారు అడ్డుకుంటున్నారు. కానీ... కరోనాతో ఎవరైనా చనిపోతే... డాక్టర్లు ఆ శవాలకు పూర్తిగా వైరస్ పోయేలా చేస్తారు. పైగా... శవాలను పూర్తిగా డబుల్ ప్యాక్ చేస్తారు. అందువల్ల మృతదేహాలతో కరోనా వైరస్ సోకదు. ఈ విషయం తెలియక చాలా మంది కరోనా మృతదేహాల ఖననాన్ని అడ్డుకుంటున్నారు.
తాజాగా కరీంనగర్లోని ఓ కాలనీకి చెందిన ముసలాయన శనివారం రాత్రి కరోనా లక్షణాలతో చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఖననం చెయ్యడానికి అధికార యంత్రాంగం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ముందుగా... కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం దగ్గర్లో అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తుండగా స్థానికులు చూశారు. భారీ సంఖ్యలో వచ్చారు. కుదరదు... తీసుకెళ్లిపోండి అని ఆందోళన చేశారు. దాంతో... డ్యాం బ్యాక్ వాటర్లో ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఖననం చేయాలని భావించి శవాన్ని అక్కడకు తీసుకెళ్లారు అంబులెన్స్ సిబ్బంది.
అక్కడ కూడా స్థానికులు చూశారు. వద్దు వద్దు... కుదరదు అంటూ ఎదురుతిరిగారు. గొడవకు దిగారు. కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే LMDలో ఎలా ఖననం చేస్తారంటూ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. అంబులెన్స్ సిబ్బందికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఉన్నతాధికారులకు కాల్ చేశారు. విషయం చెప్పారు.
ఉన్నతాధికారులు అప్పటికప్పుడు మ్యాప్ చూసి... మానేరు నది దగ్గర్లోని హిందూ స్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్లి ఖననం చేయాలని సూచించారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది... బొమ్మకల్ బైపాస్ రోడ్డులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయించారు. ఇలా... కరోనాతో ఎవరైనా చనిపోతే... అంతిమ క్రియలు చేయడం సవాలుగా మారుతోంది.
Published by:
Krishna Kumar N
First published:
July 20, 2020, 11:05 AM IST