ఏపీలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు... డీజీపీ ప్రకటన...

Corona Lockdown | Corona Update : ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం కరోనాపై అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఇప్పుడిప్పుడే కాస్త నిబంధనలు సడలిస్తోంది.

news18-telugu
Updated: May 23, 2020, 10:50 AM IST
ఏపీలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు... డీజీపీ ప్రకటన...
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మరింత స్వేచ్ఛ లభించినట్లే. ఎందుకంటే... ఏపీలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంటే... ఓ జిల్లాలో వ్యక్తి మరో జిల్లాకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు. అలాగే... తమ వాహనాల్ని కూడా తీసుకెళ్లవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదు. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అలాగే... మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతున్నాయని తెలిపారు.

ఏపీలోని జిల్లాల మధ్య అనుమతి పత్రాలు లేవు గానీ... తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే. అక్కడ మాత్రం కండీషన్లు అమలవుతున్నాయి. ఓవైపు కరోనా కేసులు ఎత్తివేస్తున్నా... ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది.

తాజాగా ఏపీలో 62 కొత్త కేసులు రావడం ఆందోళనకర అంశమే. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందేతప్ప తగ్గట్లేదు. మరణాలూ అంతే... 55కి చేరాయి. మరి వీటికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలియట్లేదు. అందుకే ప్రభుత్వం ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ... నిబంధనలు ఎత్తివేస్తోంది.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading