Corona Updates: రికవరీల్లో భారత్ టాప్.. 3 కోట్లు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.06 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్... రికవరీల్లో మాత్రం మొదటి స్థానంలో ఉంది.

news18-telugu
Updated: September 19, 2020, 6:25 AM IST
Corona Updates: రికవరీల్లో భారత్ టాప్.. 3 కోట్లు దాటిన కరోనా కేసులు
ప్రతీకాత్మ చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. అమెరికా, భారత్, బ్రెజిల్,  రష్యా, పెరూ, కొలంబియా, మెక్సికో, స్పెయిన్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.06 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. కరోనాను జయించి వీరిలో  2.23 కోట్ల మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9,55,694 మంది మరణించారు. ప్రస్తుతం 74,02,573 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. చికిత్స పొందుతున్న వారిలో 61,267 మంది పరిస్థితి విషమంగా ఉంది.

worldometers గణాంకాల ప్రకారం... అమెరికాలో 69,25,575 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు 41,91,685 మంది కోలుకోగా.. 2,03,140 మంది చనిపోయారు. అమెరికాలో ప్రస్తుతం 25,30,750 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్... రికవరీల్లో మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 5,30,5475 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 42,05,201 మంది కోలుకోగా.. 85,625  మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 10,14,649 యాక్టివ్ కేసులున్నాయి.

Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 6:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading