భారత్‌లో సెప్టెంబర్ నాటికి కరోనా అంతం... పక్కా లెక్కలతో శాస్త్రవేత్తల విశ్లేషణ

Corona Lockdown | Corona Update : ఇంతకు ముందు భారత్‌లో జూన్‌లో కరోనా అత్యంత తీవ్రంగా ఉంటుందన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి సెప్టెంబర్ లెక్కేంటి?

news18-telugu
Updated: June 7, 2020, 8:39 AM IST
భారత్‌లో సెప్టెంబర్ నాటికి కరోనా అంతం... పక్కా లెక్కలతో శాస్త్రవేత్తల విశ్లేషణ
భారత్‌లో సెప్టెంబర్ నాటికి కరోనా అంతం... పక్కా లెక్కలతో శాస్త్రవేత్తల విశ్లేషణ (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇండియాలో కరోనా వైరస్ పెరుగుతున్న తీరు చూసి... ఇక ఇది ఎప్పటికి తగ్గుతుందో అని టెన్షన్ పడేవారికి... రెండు రకాల ఆరోగ్య నిపుణులు... చెప్పిన మాటలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎందుకంటే... వాళ్లిద్దరూ... సెప్టెంబర్ మధ్య నాటికి ఇండియాలో కరోనా వైరస్ పోతుందని అంటున్నారు. ఆ శాస్త్రవేత్తలు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వారే. మేథమేటికల్ మోడల్‌తో విశ్లేషణ చేసి ఈ అంచనాకి వచ్చారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వస్తున్నాయో... దాదాపు అన్నే కేసులు రికవరీ కూడా అవుతున్నాయి. అంటే... మొత్తంగా కరోనా కేసుల పెరుగుదల స్థిరంగా అవుతున్నట్లే. ఈ ట్రెండ్ క్రమంగా రివర్స్ అయ్యి... కొత్తగా వచ్చే కేసుల సంఖ్య తగ్గుతూ... రికవరీ అయ్యే కేసుల సంఖ్య పెరుగుతూ పోతుందని అంచనా వేస్తున్నారు. ఇలా సెప్టెంబర్ మధ్య నాటికి పూర్తిగా కరోనా కొత్త కేసులు రావడం మేనేస్తాయని అంటున్నారు.

ఆన్‌లైన్ జర్నల్ ఎపిడెమాలజీ ఇంటర్నేషనల్‌లో ఈ విశ్లేషణను ప్రచురంచారు. ఆరోగ్య శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్, లెప్రసీ విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రూపాలీ రాయ్ ఈ విషయం చెప్పారు. బెయిలీ ఇంటర్నేషనల్ మోడల్ ఉపయోగించి... కరోనా లెక్కలు, విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 236657గా ఉన్నాయి. ఐతే... యాక్టివ్ కేసుల సంఖ్య... 115942గా ఉంది. అంటే... యాక్టివ్ కేసుల కంటే... రికవరీ కేసులు 4773 ఎక్కువ. తద్వారా... యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లే. అంటే... కరోనా వైరస్ ఇండియాలో తగ్గుతున్నట్లే అని ఈ విశ్లేషకులు చెబుతున్నారు. మృతుల సంఖ్యను తగ్గిస్తూ... రికవరీలను పెంచుతూ పోతే... కరోనాకి చెక్ పెట్టినట్లవుతుందంటున్నారు.

మార్చి 2న ఇండియాలో కరోనా ప్రారంభమైంది. ఓ పది రోజుల తర్వాత నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలోనే కొత్త కేసుల నమోదులో బ్రెజిల్, అమెరికా తరవాత భారత్ మూడో స్థానానికి చేరింది. జూన్ నెలాఖరు నాటికి కొత్త కేసుల జోరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా రికవరీలు ఉంటే ఇండియా కరోనా నుంచి బయటపడగలదంటున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించాలంటున్నారు.
First published: June 7, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading