కరోనా రాకుండా చర్యలకు ఆదేశించే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికే కరోనా సోకింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్కు కరోనా వైరస్ సోకింది. తీవ్ర అలసట, జలుబు, జ్వరంతో బాధపడటంతో మంగళవారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్ రూమ్‌లో ఉంచి, వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన కూడా చేశారు. కాగా, కరోనా సోకిన తొలి ఎంపీ ఆమే. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 380 మందికి కరోనా వైరస్ సోకగా ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

నాడిన్
కాగా, ఇండియాలో కరోనా సోకిన వారి సంఖ్య 61కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా 119 దేశాలకు విస్తరించింది. కరోనా మరణాల సంఖ్య 4,270కి చేరింది. కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య 1.18 లక్షలకు చేరింది. చైనాలో కరోనా మరణాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఇటలీలో మాత్రం మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:March 11, 2020, 08:21 IST