సౌరవ్ గంగూలీ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. తాజాగా మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

news18-telugu
Updated: June 20, 2020, 6:42 AM IST
సౌరవ్ గంగూలీ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా
గంగూలీ(File)
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. తాజాగా మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సౌరవ్‌ గంగూలీ అన్నయ్య, వారి కుటుంబ సభ్యులైన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి స్నేహాశిష్‌ భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు వారి ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే స్నేహాశిష్‌ అత్తమామలు కూడా కోవిడ్ బారినపడ్డారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,090 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,303 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 529 మంది మరణించారు. ప్రస్తుతం బెంగాల్‌లో 5,258 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: June 20, 2020, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading