Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS TWO CASES TESTS NEGATIVE IN TELANGANA SAYS ETELA RAJENDER BA

CoronaVirus: ఆ ఇద్దరికీ కరోనా లేదు... గుడ్ న్యూస్ చెప్పిన ఈటల

మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్

పెండింగ్‌లో ఉన్న ఇద్దరికి సంబంధించి కరోనా టెస్ట్ రిపోర్టులు వచ్చాయని, వారిద్దరికీ ఎలాంటి కరోనా లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

    తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓ తీపికబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఇద్దరికి సంబంధించి కరోనా టెస్ట్ రిపోర్టులు వచ్చాయని, వారిద్దరికీ ఎలాంటి కరోనా లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకిందనే అనుమానంతో ఆ కంపెనీ మొత్తం ఖాళీ చేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పిచారు. అయితే, ఆమెకు కరోనా లేదని రిపోర్టుల్లో తేలింది. ఇక అపోలో ఆస్పత్రిలో శానిటేషన్ పనిచేసే మహిళకు కూడా కరోనా లేదని రిపోర్టులో వచ్చినట్టు ఈటల రాజేందర్ తెలియజేశారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణలో ఒకరికి మాత్రమే కరోనా ఉందని, అతడి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతోందని, రెండు మూడు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. మరోవైపు నిన్న టెస్టులు చేసిన వారిలో 21 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని ఈటల మీడియాకు తెలిపారు. ఈ రోజు మరో పది మందికి టెస్టులు నిర్వహించామన్నారు.

    తెలంగాణ గడ్డ మీద ఒక్కరికి కూడా కరోనా రాలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దుబాయ్ వెళ్లి వచ్చిన వ్యక్తికి మాత్రమే వచ్చిందని,అతడికి కూడా రెండు మూడు రోజుల్లో నయం అవుతుందని చెప్పారు. కాబట్టి, ప్రజలు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్‌కు విరివిగా ఫోన్లు వస్తున్నాయని, గొంతు నొప్పి, జలుబు చేసినా కూడా అనుమానంతో ఆస్పత్రులకు వచ్చేస్తున్నారని ఈటల అన్నారు. అయితే, కేవలం దగ్గు, జలుబు ఉన్నంత మాత్రాన కరోనా శాంపిల్స్ తీసుకోవడం సాధ్యం కాదని, కరోనా లక్షణాలు ఉంటేనే తీసుకోగలమని చెప్పారు. అలాగే, డబ్బులు కడతాం టెస్టులు చేయండంటూ కూడా కొందరు ఫోన్లు చేస్తున్నారని, కరోనా టెస్టులు కేవలం ఆ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

    ఇక ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఒకవేళ ఎవరైనా ఆ ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే, దానికి ట్రీట్‌మెంట్ ఏం చేయాలి? ఎంత బిల్లు వేయాలనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేస్తుందన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు