కరోనా కుమార్, కరోనా కుమారి.. కడప జిల్లాలో పిల్లలకు వైరస్ పేర్లు

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు డాక్టర్. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో వాటినే ఖరారు చేశారు.

news18-telugu
Updated: April 7, 2020, 8:50 PM IST
కరోనా కుమార్, కరోనా కుమారి.. కడప జిల్లాలో పిల్లలకు వైరస్ పేర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ పేరు చెబితేనే యావత్ ప్రపంచం గజాగజా వణికిపోతోంది. జనం పిట్టల్లా రాలుతుండడంతో ఈ మహమ్మారి పేరును తలచుకునేందుకే భయపడిపోతున్నారు. కానీ అంతటి ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు మనుషుల పేరుగా మారిపోతోంది. ప్రస్తుత విపత్కర సమయంలో పుట్టిన పిల్లలకు కరోనా పేరు కలసి వచ్చేలా నామకరణం చేస్తున్నారు తల్లిదండ్రులు. తాజాగా కడప జిల్లాలో ఇద్దరు చిన్నారులకు కరోనా పేరు పెట్టారు. వేంపల్లె పట్టణంలో పుట్టిన మగ, ఆడ శిశువులకు ఈ వైరస్ పేరుతో నామకరణం చేశారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. నిన్న వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది.

ఆసుపత్రి నిర్వాహకుడు అయిన డాక్టర్ బాషా వీరిద్దరికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ఐతే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు డాక్టర్. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో వాటినే ఖరారు చేశారు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు చోటుచేసుకున్నాయి. అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ 1979లో హిందూ సముద్రంలో కుప్పకూలింది. ఈ సమయంలో ఇండియాలో పుట్టిన వారిలో పలువురికి స్కైలాబ్ అని పేరుపెట్టారు తల్లిదండ్రులు. తాజాగా ఇప్పుడు కరోనా పేరు ఫ్యాషన్‌గా మారింది. యూపీలో కూడా ఇద్దరు చిన్నారులకు లాక్‌డౌన్, కరోనా అని పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇదే బాటలో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు కరోనా నామకరణం చేస్తున్నారు.

Published by: Shiva Kumar Addula
First published: April 7, 2020, 7:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading