అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్.. కిరాణా షాపులు కూడా బంద్

అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్.. కిరాణా షాపులు కూడా బంద్

ప్రతీకాత్మక చిత్రం

రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని.. చివరకు కిరాణా, కూరగాయల దుకాణాలు కూడా తరచుకోవని స్పష్టం చేశారు. కేవలం మెడికల్ షాపులు, ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పారు.

 • Share this:
  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గౌహతి నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని.. చివరకు కిరాణా, కూరగాయల దుకాణాలు కూడా తెరచుకోవని స్పష్టం చేశారు. కేవలం మెడికల్ షాపులు, ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పారు. వారం రోజుల తర్వాత సమీక్ష చేసి, అప్పుడే సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు కఠిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు అసోం మంత్రి.

  లాక్‌డౌన్ విధించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కామరూప్ మెట్రో పాలిటన్ మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంది. ప్రజలెవరూ మాస్క్‌లు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. వ్యాపారులు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని తెలుసు. ఐనా తప్పడం లేదు.
  జనాలు మాట విననప్పుడు ఇంతకు మించిన మార్గం లేదు.
  హిమంత బిశ్వ శర్మ


  ఇతర పట్టణాల్లో కూడా శని, ఆది వారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తాని అసోం ప్రభుత్వం తెలిపింది. కాగా, అసోంలో ఇప్పటి వరకు 6,646 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,033 మంది కోలుకోగా.. 9 మంది మరణించారు. ప్రస్తుతం అసోంలో 2,601 యాక్టివ్ కేసులున్నాయి. ఐతే జూన్ 15 తర్వాత గౌహతిలో 762 కరోనా కేసులున్నాయి. వీరిలో 676 మందికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా నగరాన్ని లాక్‌డౌన్ చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.


  First published: