Coronavirus: ఇవాళ్టి నుంచి అక్కడ కర్ఫ్యూ.. కరోనా విజృంభణతో అన్నీ బంద్

దీపావళి తర్వాత 200కు పైగా కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కర్ఫ్యూను విధించింది. కరోనా మళ్లీ విజృంభిస్తోందని.. శీతాకాలంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించింది.

news18-telugu
Updated: November 20, 2020, 6:49 AM IST
Coronavirus: ఇవాళ్టి నుంచి అక్కడ కర్ఫ్యూ.. కరోనా విజృంభణతో అన్నీ బంద్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి తర్వాత పలు నగరాల్లో భారీగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పండగల వేళ జనాలు గుంపులుగా కలిసి తిరగడం, చలి కాలం ప్రారంభమైన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా నమోదువుతన్నాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్ నగర యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కేవంల పాల షాపులు, మెడికల్ దుకాణాలకు మాత్రమే అనుమతి వచ్చింది. మిగతా అన్నింటికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం విజయ్ రూపానీ రివ్యూ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, AMC (అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులతో భేటీ అనంతరం నగరవ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ సమావేశమై.. సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం వేళ కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని.. సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు. సోమవారం తర్వాత రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.



గురువారం నాటి బులెటిన్ ప్రకారం.. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం 2,845 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధిక కేసులు పశ్చిమ ప్రాంతం నుంచే ఉన్నాయి. నార్త్‌వెస్ట్ జోన్‌లో 477, సౌత్‌వెస్ట్ జోన్‌లో 452, వెస్ట్ జోన్‌లో 466, సెంట్రల్ జోన్‌లో 274 కేసులు ఉన్నాయి. గతంలో ఇక్కడ నిత్యం 150 నుంచి 170 వరకు కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ దీపావళి తర్వాత 200కు పైగా కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కర్ఫ్యూను విధించింది. కరోనా మళ్లీ విజృంభిస్తోందని.. శీతాకాలంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించింది. మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: November 20, 2020, 6:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading