Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS TOTAL CASES IN TELANGANA RISED TO 453 SK

తెలంగాణలో 453కు పెరిగిన కరోనా కేసులు.. రేపు వారంతా డిశ్చార్జ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రస్తుతం 80వేల పీపీఈ కిట్లు ఉన్నాయని.. మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం లక్ష N-95 మాస్క్‌లు ఉంటే మరో 5 లక్ష మాస్క్‌లను తెప్పిస్తున్నామన్నారు మంత్రి.

    తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇవాళ మరో 49 పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దాంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య  453కి చేరిందని తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 45 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 11 మంది చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 397 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయన్నారు ఈటల రాజేందర్. వీరిలో ఎవరూ వెంటిలేటర్ల మీద లేరని.. సాధారణ ట్రీట్‌మెంటే జరుగుతుందని చెప్పారు. ఇక విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితులంతా క్షేమంగా ఉన్నారని.. వారిని రేపు డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేశారు ఈటల.

    తెలంగాణలో ఇవాళ మరో 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 453కి చేరింది. విదేశాల నుంచి కరోనాతో వచ్చిన వారంతా కోలుకున్నారు. రేపు డిశ్చార్జి చేస్తాం. మర్కజ్‌కు వెళ్లొచ్చిన 1100 మందికి పరీక్షలు చేశాం. వారికి దగ్గరగా మెలిగిన 3158 మంది క్వారంటైన్ చేశాయి. రాబోయే రోజుల్లో అనుమానితుల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రంలో మందుల కొరత లేదు. డాక్టర్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మొత్తం 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సైతం కోవిడ్ ఆస్పత్రులుగా పనిచేస్తాయి.
    ఈటల రాజేందర్

    వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన

    కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు డాక్టర్లకు అవసరమైన పరికరాలు, రక్షణ కిట్లు కూడా అందజేశామని చెప్పారు ఈటల. తెలంగాణలో ప్రస్తుతం 80వేల పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు ఉన్నాయని.. మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం లక్ష N-95 మాస్క్‌లు ఉంటే మరో 5 లక్ష మాస్క్‌లను తెప్పిస్తున్నామన్నారు మంత్రి. 2 కోట్ల సర్జికల్ మాస్క్‌లు, కోటి గ్లౌజులు, 5 లక్షల గాగుల్స్ సైతం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే ప్రత్యేక విమానాన్ని పంపించి వీటిని వీలైనంత త్వరగా తెప్పిస్తామని స్పష్టం చేశారు మంత్రి ఈటల.



    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Eetala rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు