ఇండియాలో 12వేలు దాటిన కరోనా కేసులు.. 400 దాటిన మృతులు..

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటిపోయాయి. మరణాల సంఖ్య 34 వేలు దాటిపోయింది.

దేశంలో కరోనా మరింత విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలతో పోల్చితే కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నా.. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 12,380కు చేరుకుంది.

  • Share this:
    దేశంలో కరోనా మరింత విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలతో పోల్చితే కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నా.. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 12,380కు చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 414 మంది మృతిచెందారు. కాగా.. ప్రస్తుతం 10,477 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1488 మంది కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు. గత 12 గంటల్లో 280 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో నిన్న తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో బుధవారం కేవలం 6 కొత్త కేసులే నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 8 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 118 మంది కోలుకోగా.. 18 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

    అటు.. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే ఐదుగురు కరోనా పాజిటివ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14కు పెరిగింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురం జిల్లాలో ఒక కొత్త కేసు నమోదైంది. కొత్తగా నమోదైన 23 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 525కి పెరిగింది. వారిలో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది చనిపోయారు. ప్రస్తుతం 491 మంది చికిత్స పొందుతున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: