కరోనా కర్రీ, మాస్క్ నాన్... అదిరే టేస్ట్... లొట్టలేస్తున్న కస్టమర్లు...

కరోనా కాలంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆ రెస్టారెంట్ తెలివైన ప్లాన్ వేసింది. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కరోనా కర్రీ తింటూ... మాస్క్ నానా లాగిస్తున్నారు.

news18-telugu
Updated: August 1, 2020, 12:16 PM IST
కరోనా కర్రీ, మాస్క్ నాన్... అదిరే టేస్ట్... లొట్టలేస్తున్న కస్టమర్లు...
కరోనా కర్రీ, మాస్క్ నాన్... అదిరే టేస్ట్... లొట్టలేస్తున్న కస్టమర్లు... (credit - Facbook)
  • Share this:
మనుషుల్ని చంపుతున్న కరోనా వైరస్ అంటే అందరికీ పీకల దాకా కోపంగా ఉంది. వ్యాక్సిన్ రావాలీ... ఆ వైరస్ అంతు చూస్తాం అని అంతా వ్యాక్సిన్ కోసం చూస్తున్నారు. వైరస్ భయంతో హోటళ్లకు దూరంగా ఉంటున్న కస్టమర్లను ఆకర్షించేందుకు రెస్టారెంట్లు తెలివైన ప్లాన్స్ వేస్తున్నాయి. రాజస్థాన్ జోధపూర్‌లో వేదిక మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్... కొత్త ప్రయోగం చేసింది. ప్రజలు మాస్క్ ధరించాలనీ, కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ... మాస్క్ నాన్‌లు, కరోనా వైరస్ కర్రీలు తయారుచేస్తోంది. అంటే వైరస్‌తో కర్రీలు వండట్లేదు. వైరస్ ఆకారంలో కనిపించేలా కర్రీలను సెర్వ్ చేస్తోంది. దాంతో కస్టమర్లు కసితీరా కర్రీ తింటూ... మాస్క్ నాన్‌లో నంజుకుంటూ... లొట్టలేస్తున్నారు.


నిజానికి ఇది మలాయ్ కోఫ్తా కర్రీ. ఇందులో కోఫ్తాలను కరోనా వైరస్ ఆకారంలో చేస్తున్నారు. నాన్ కూడా అంతే... ఎప్పుడూ చేసేలాగే చేస్తూ... చూడటానికి కరోనా మాస్క్‌లా కనిపించేలా చేస్తున్నారు. తద్వారా కస్టమర్లు వాటిని తినేందుకు ఇక్కడకు వస్తున్నారు. అదే సమయంలో వారిలో కరోనా వైరస్‌పై ఉండే భయం కూడా పోతోంది.
కరోనా కర్రీ, మాస్క్ నాన్... అదిరే టేస్ట్... లొట్టలేస్తున్న కస్టమర్లు...


మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అంటున్న రెస్టారెంట్ యాజమాన్యం... అత్యంత పరిశుభ్రత, శానిటేషన్ చర్యలు తీసుకుంటున్నామనీ... మెనూ కూడా ముట్టుకోకుండానే డిసైడ్ చేయవచ్చని తెలిపారు. సోషల్ డిస్టాన్సింగ్ తప్పనిసరిగా అమలుచేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ కరోనా కర్రీ, నాన్ మాస్క్ వైరల్ అయ్యాయి. చాలా మంది వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి ఇండియాలోనే ఉంటాయంటున్నారు. శానిటైజర్‌లా కనిపించే వాటర్ కూడా ఇస్తే సరిపోతుందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 12:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading