Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS THIRD WAVE RAPID SURGE IN COVID R NUMBER FROM JUNE END HINTS AT FRESH OUTBREAK IN INDIA SK

Covid Third Wave: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌‌.. ఇవే సంకేతాలు.. మరో విధ్వంసం తప్పదా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Third wave: ఒకవేళ ఆర్ వ్యాల్యూ 1 దాటిందంటే.. కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతుంది. కేసులు అనూహ్యంగా పెరుగుతాయి. అందుకే పెరుగుతున్న ఆర్ వ్యాల్యూని చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    కరోనా మొదటి దశ నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే రెండో దశ వ్యాప్తి చెందింది. దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించింది. ఐతే రెండో దశలో భారీగా మరణాలు నమోదైనా.. జనాలు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. జాగ్రత్తగా లేకుంటే మూడో దశ వ్యాప్తి విరుచుకుపడుతుందని.. పెను ముప్పు తప్పదని ఇటు ప్రభుత్వాలు..అటు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐనా చాలా ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహహరిస్తున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. భౌతిక దూరం పాటించడకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.  మాస్క్ లేకుండానే సంచరిస్తున్నారు. ఈ కారణంగా కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఆర్ నెంబర్ పెరగడమే ఇందుకు నిదర్శనం.

    ఆర్ వ్యాల్యూ అంటే ఏంటి?

    కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ వ్యాల్యూగా పేర్కొంటారు. ఒకవేళ ఆర్ వ్యాల్యూ 0.82గా ఉందనుకోండి. 100 మంది కరోనా బాధితుల నుంచి ఆ వ్యాధి మరో 82 మందికి సోకుతున్నట్లు లెక్క. జూన్ నెలాఖరు వరకు కరోనా సంక్రమణ రేటు తగ్గూతూ వచ్చింది. కానీ జూన్ 20 నుంచి జులై 7 మధ్య మళ్లీ పెరిగింది. మే 15 నాటికి ఆర్ వ్యాల్యూ 0.78 గా ఉండేది. కానీ జూన్ 26కు వచ్చే సరికి దాని విలువ 0.88కి చేరింది. అంటే మేలో ప్రతి 100 మంది బాధితుల నుంచి 78 మంది వ్యక్తులకు కరోనా సోకగా..  ప్రస్తుతం 88 మందికి వ్యాప్తి చెందుతోంది. ఈ విషయాన్ని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌ వెల్లడించింది.

    ఆర్ వ్యాల్యూ తగ్గుతూ వస్తే.. కరోనా కేసులు కూడ తగ్గుముఖం పడతాయి. క్రమంగా కోవిడ్ కనుమరుగు అవుతుంది. కానీ ఒకవేళ ఆర్ వ్యాల్యూ 1 దాటిందంటే.. కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతుంది. కేసులు అనూహ్యంగా పెరుగుతాయి. అందుకే పెరుగుతున్న ఆర్ వ్యాల్యూని చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మూడో దశ వ్యాప్తికి ఇవే బలమైన సంకేతాలని అభిప్రాయపడుతున్నారు.

    జులై 5న  34వేలకు కేసుల సంఖ్య తగ్గింది. ఆ లెక్కలను చూసి కరోనా పూర్తిగా తగ్గిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాతి రోజు నుంచి మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 40వేలకు పైగా నమోదవుతున్నాయి.  ఐనప్పటికీ ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. గతంలో రోజులు 4 లక్షల కేసులు వచ్చేవి. ఇప్పుడు 40వేలు వస్తున్నాయి. దీని చూసి కరోనా తగ్గినట్లుగా భావించవద్దని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధిపతి వీకే పాల్ తెలిపారు. రోజువారీ కరోనా కేసులు 10వేల లోపు వస్తేనే కోవిడ్ తగ్గినట్లుగా భావించాలని అన్నారు. మన దేశంలో ఆ పరిస్థితి వచ్చేందుకు మరో మూడు వారాలు పట్టవచ్చని తెలిపారు. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

    కాగా, మనదేశంలో ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 30శాతంపైగా కేరళలోనే నమోదవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ 1పైనే ఉంది. కేరళలో 1.1, మహారాష్ట్రలో 1గా ఉంది. అందుకే అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరిస్తేనే.. ఆర్ వ్యాల్యూ తగ్గుతుంది. అప్పుడే మనం కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి:

    Corona 3rd Wave: అక్కడ కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది.. భారీగా కొత్త కేసులు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona cases, Coronavirus, Covid-19

    తదుపరి వార్తలు