Corona Virus: దేశంలోని ఆ రాష్ట్రంలో కరోనా మూడో దశ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Covid-19 Delhi: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. డిల్లీలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఊహించ‌లేనిదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

news18-telugu
Updated: October 29, 2020, 5:06 PM IST
Corona Virus: దేశంలోని ఆ రాష్ట్రంలో కరోనా మూడో దశ.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే.. ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఎన్నడూ లేని విధంగా కొత్తగా 5673 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఢిల్లీలో క‌రోనా మూడో ద‌శ‌కు చేరుకుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా స్పందించారు. ఢిల్లీలో కరోనా మూడో దశ ప్రారంభమైందని ఇప్పుడు చెప్పలేమని ఆయన తెలిపారు. ఇందుకోసం మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని వెల్లడించారు. అయితే ఢిల్లీలో క‌రోనా మూడో ద‌శ‌కు చేరే అవ‌కాశం మాత్రం ఉంద‌ని మంత్రి సత్యేంధ్ర జైన్ తెలిపారు. గ‌త వారం రోజులుగా ఢిల్లీలో రోజూ స‌గ‌టున సుమారు 4వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదవుతుండ‌టం ఆందోళన కలిగిస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. డిల్లీలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఊహించ‌లేనిదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చేది పండుగ‌ల సీజ‌న్‌తో పాటు శీతాకాలం కావ‌డంతో ఇప్పటివరకు అనుసరిస్తున్న పద్ధతుల్లో కొన్ని మార్పులు చేశామని ఆయన తెలిపారు. ఓ వ్యక్తికి కరోనా సోకితే.. అతడి కుటుంబంతో పాటు సన్నిహితులందరికీ కరోనా టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండ‌గా మొత్తం కేసుల సంఖ్య 3.7 లక్షలకు చేరుకుంది. ఇక ఈ నెల ప్రారంభంలోనే ఢిల్లీలో రోజుకు స‌గ‌టున 15వేల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది. కరోనా లక్షణాలు ఉన్నవారికి మొదట పరీక్షలు చేసి.. ఆ తరువాత కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని.. కరోనా కేసులకు తగ్గట్టుగానే ఢిల్లీ ఆస్పత్రుల్లో పడకలను సిద్ధం చేయాలని సూచించింది.
Published by: Kishore Akkaladevi
First published: October 29, 2020, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading