కరోనా విజృంభిస్తున్నా లాక్‌డౌన్ ఉండదు.. క్లారిటీ ఇచ్చిన ఆ రాష్ట్రాలు

తమిళనాడు ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది.

news18-telugu
Updated: June 15, 2020, 5:28 PM IST
కరోనా విజృంభిస్తున్నా లాక్‌డౌన్ ఉండదు.. క్లారిటీ ఇచ్చిన ఆ రాష్ట్రాలు
ఈనెల 23వ తేదీ వరకు నెల్లూరు నగరం లాక్ డౌన్ కానుంది.
  • Share this:
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశమంతటా మళ్లీ లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధింపుపై ఆయా ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ట్విటర్ వేదికగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కరోనాపై అఖిల పక్ష సమావేశం జరిగిన కాసేపటికే ఈ ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం.


అటు గుజరాత్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారంపై సీఎం విజయ్ రూపాని క్లారిటీ ఇచ్చారు. మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రణాళిక ఏదీ తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. జూన్ 1 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో పరిశ్రమలు, కార్యాలయాలు, బస్సులు, ఆటోలకు అనుమతి ఇవ్వడంతో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సైతం మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ఆదివారం వెల్లడించారు. ఐతే తమిళనాడు ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పళని స్వామి ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: June 15, 2020, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading