గుడ్ న్యూస్: ఇకపై ప్రైవేటు లేబోరేటరీల్లో సైతం కరోనా టెస్టులు లభ్యం..

ఇకపై ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుపనున్నారు.

news18-telugu
Updated: March 29, 2020, 11:56 PM IST
గుడ్ న్యూస్: ఇకపై ప్రైవేటు లేబోరేటరీల్లో సైతం కరోనా టెస్టులు లభ్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుపనున్నారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి ల్యాబోరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, బోయిన్ పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్, న్యూబోయిన్ పల్లిలోని మెడిసిన్ పాథ్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాథ్ కేర్ ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000 దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని, 27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. బెంగాల్,తమిళనాడు, పంజాబ్, కేరళ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,బీహార్ రాష్ట్రాల్లో ఒక్కో కరోనా మరణం నమోదవగా,మహారాష్ట్రలో 7,మధ్యప్రదేశ్ లో 2,కర్ణాటకలో 3,గుజరాత్ లో 4,ఢిల్లీలో2 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేసుల నమోదులో కేరళ రెండవ స్థానంలో ఉంది. మూడవస్థానంలో కర్ణాటక,నాలుగవ స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading