పిల్లల్లో కరోనా వ్యాప్తి.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న కెన‌డియ‌న్ ప‌బ్లిక్ హెల్త్ సర్వే

ప్రతీకాత్మక చిత్రం

టీనేజ్ వారితో పోలిస్తే చిన్న పిల్ల‌ల ద్వారా కుటుంబీకుల‌కు క‌రోనా సోక‌డం చాలా త‌క్కువ. కానీ కెన‌డియ‌న్ ప‌బ్లిక్ హెల్త్ తాజా నివేదిక ప్ర‌కారం చిన్న పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే కుటుంబంలో దాని వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని తెలిపింది. ఈ కారణంగా పిల్లలను ప్రాథమిక ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచాలని సూచించింది.

 • Share this:
  టీనేజ్ వారితో పోలిస్తే చిన్న పిల్ల‌ల ద్వారా కుటుంబీకుల‌కు క‌రోనా సోక‌డం చాలా త‌క్కువ. కానీ కెన‌డియ‌న్ ప‌బ్లిక్ హెల్త్ తాజా నివేదిక ప్ర‌కారం చిన్న పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే కుటుంబంలో దాని వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని తెలిపింది. పిల్ల‌లు సాధార‌ణంగా ఒంట‌రిగా ఉండ‌లేరు. వారికి క‌రోనా సోకింద‌ని గుర్తించ‌డం క‌ష్టం. ముఖ్యంగా వారికి ఉన్న ఇమ్యూనిటీ కార‌ణంగా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌వు. దీంతో వారిని ఆడించేందుకో వారితో గ‌డిపేదుకో వెళ్ల పెద్ద‌ల‌కు క‌రోనా సోకుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. జామా పిడియాట్రిక్ జ‌ర్న‌ల్‌లో ఈ అంశంపై విశ్లేష‌ణ ప్ర‌చురిత‌మైంది. క‌రోనా వ్యాప్తిలో పిల్ల‌ల పాత్ర‌పై త‌గు విశ్లేష‌ణ‌ల‌తో ఈ జ‌ర్న‌ల్ స‌మాచారాన్ని ప్ర‌చురించింది.
  ఈ ప‌రిశోధ‌న‌లో ఆస్ట్రేలియా విశ్వ‌విద్యాలయానికి చెందిన ప‌బ్లిక్ హెల్త్ రీసెర్చ్ జో హైడ్ మాట్లాడుతూ పిల్ల‌ల‌కు కూడా క‌రోనా తొంద‌ర‌గా వ్యాప్తి చెందుతుంద‌ని పేర్కొన్నారు. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఆడుకున్న‌ప్పుడు ఎక్క‌డైనా వారికి సోక‌వ‌చ్చు అని అన్నారు. కానీ వారికి వ్యాప్తి క‌లిగింద‌ని గుర్తించే లోపే చాలా మందికి సోకుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
  విశ్వవిద్యాలయంలో శ్వాసకోశ పరిశోధకుడు డాక్టర్ టీనా వి. హార్టర్ట్ మాట్లాడుతూ పిల్ల‌ల‌ను ఇంట్లో నిర్బంధించ‌డం వ‌ల్ల వారు ఆందోళ‌న‌కు గుర‌వుతారు. తోటి వారితో దూరం ఉండ‌డం వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డార‌ని అన్నారు.  ఈ కారణం వల్ల కూడా పిల్లల్లో కరోనా వ్యాప్తి జరుగుతుందని అన్నారు.
  పబ్లిక్ హెల్త్ అంటారియోలో పరిశోధకులు నిర్వహించిన కొత్త అధ్యయనం ప్ర‌కారం జూన్ 1 నుంచి డిసెంబ‌ర్ 31, 2020 వ‌ర‌కు అంటారియోలో కోవిడ్ 19 కేసులు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తీ ఇంటిలో అంద‌రినీ ప‌రీక్షించారు."ఇండెక్స్ కేసు"-కోవిడ్ -19 లక్షణాలను గుర్తించి ప‌రీక్ష చేశారు.
  ఆ స‌మ‌యంలో 6,280 గృహాల‌పై దృష్టి పెట్టి ప‌రీక్షించారు. అందులో వైర‌స్ సోకిన వ్య‌క్తి మొద‌ట 18 ఏళ్ల లోపువాళ్లే ఉండ‌డం గ‌మ‌నార్హం. చాలా ఇళ్ల‌ల్లో వ్యాధి సోకిన పిల్ల‌లో అంటు వ్యాప్తి ఆగిపోయింది. కానీ 27.3శాతం పిల్లల ద్వారా ఇంట్లో వ్య‌క్తి వైర‌స్ సోకిందని వైద్యులు గుర్తించారు.
  14-17 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు అన్ని ఇండెక్స్ కేసులలో 38% ఉన్నారు. కేవలం 12% గృహాలలో 3 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మొదట అనారోగ్యానికి గురయ్యారు.
  "ఇంటి బ‌య‌ట టీనేజ్ ప్రవర్త గురించి  మేము ఆలోచించినప్పుడు, వారు కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారని..  ఇతరులకు వారు తరచుగా చాలా దగ్గరగా ఉంటున్నారని గుర్తించాం" అని డాక్టర్ సుసాన్, ఫిలడెల్ఫియా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో అంటు వ్యాధి నిపుణుడు కాఫిన్ అన్నారు.
  అయితే వ్యాధి వ్యాప్తి యొక్క డైనమిక్స్ సంక్లిష్టంగా ఉన్నాయ‌ని నిపుణులు అభిప్రాయ ప‌డ్డారు. వైరస్ వ్యాప్తి చెందడంలో పిల్లలు పోషించే ఖచ్చితమైన పాత్రను పూర్తిగా ధ్రువీక‌రించ‌లేమంటున్నారు.
  కేవ‌లం 12 ఏళ్లలోపు పిల్లలు ఇంకా టీకాలకు అర్హులు కానప్పటికీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకున్నారని నిర్ధారించుకోవడం గృహ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడుతుందని నిపుణులు తెలిపారు. పిల్ల‌ల‌కు మెరుగైన ప‌రీక్ష‌లు, ఇంట్లో వెంటిలేష‌న్ క‌ల్పించ‌డం ద్వారా ప్రాథ‌మిక ఇన్ఫెక్ష‌న్‌ల‌కు దూరంగా ఉంచ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.
  Published by:Sharath Chandra
  First published: