లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం.. రాష్ట్రాలు, నిపుణుల నుంచి విజ్ఞప్తులు

ప్రస్తుతం పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తేనే బాగుటుందని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్రాలు చేస్తున్న విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సైతం సమాలోచనలు జరుపుతున్నారు.

news18-telugu
Updated: April 7, 2020, 4:20 PM IST
లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం.. రాష్ట్రాలు, నిపుణుల నుంచి విజ్ఞప్తులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
'' కరోనా నుంచి బయటపడాలంటే లాక్‌డౌన్ తప్ప భారత్‌కు మరో మార్గం లేదు. ఆర్థికంగా నష్టపోతే తిరిగి పుంజుకోవచ్చు. కానీ ప్రాణాలు పోతే తిరిగి తేలేం. బతికుంటే బలుసాకు తిని జీవించవచ్చు. లాక్‌డౌన్‌ను మరో వారం లేదా రెండు వారాలు పొడిగించాల్సిందే''. లాక్‌డౌన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. ఐతే కేవలం తెలంగాణయే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సైతం ఇదే అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. అంతేకాలు పలు రంగాల నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రానికి సూచిస్తున్నారు.



కోవిడ్ 19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌14వ తేదీతో ఈ లాక్‌డౌన్‌ ముగుస్తుంది. ఐతే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందని.. మర్కజ్ ఎపిసోడ్‌తో కేసుల సంఖ్య అమాంతం పెరిగిందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తేనే బాగుటుందని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్రాలు చేస్తున్న విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సైతం సమాలోచనలు జరుపుతున్నారు. కేంద్రమే లాక్‌డౌన్‌ను పొడిగించాలా..? లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలకే ఆ నిర్ణయాన్ని వదిలేయాలా? అన్న దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకొని ప్రకటన విడుదల చేసే అవకాశముంది. ఐతే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణంయ తీసుకుంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
First published: April 7, 2020, 3:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading