ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడం, వారు కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించినట్టు తేలడంతో, కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొందరు ఎలాంటి ప్రయాణాలు చేయకపోయినా, కరనా సోకిన వారితో కాంటాక్ట్ కాకపోయినా కూడా వారికి కరోనా సోకింది. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఏపీలోని పోలీసులకు డీజీపీ కార్యాలయం మెమో జారీ చేసింది. అందులో పలు సూచనలు చేసింది. కేబుల్ టీవీ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే వారు, పాలు పోసేవారు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, కూరగాయలు షాపులు, పండ్ల దుకాణాలు, మెడికల్ షాపులు కరెన్సీ విరివిగా వాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఆర్ఎంపీ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు కూడా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం 5 నుంచి బుధవారం ఉదయం 9 వరకు కొత్తగా... 19 కేసులు నమోదవ్వడంతో... ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరింది. కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. గుంటూరులో కొత్త కేసులు తగ్గాయి కదా అనుకుంటే... అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 8 రావడం డేంజర్ బెల్ అనుకోవచ్చు. రాష్ట్రంలోని 502 కేసుల్లో ఇప్పటివరకూ 16 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో అనంతపురం నుంచి 2, కృష్ణ 3, గుంటూరు 4, కర్నూలు 1, నెల్లూరు నుంచి 1 ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్న వారి సంఖ్య 475గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Gautam Sawang