దండం పెడుతున్నా..బయటకు రావొద్దు.. కరోనాపై కలెక్టర్ విజ్ఞప్తి

దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నారు సిరిసిల్ల కలెక్టర్. కరోనా వ్యాధిని కట్టడిచేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నారు.

news18-telugu
Updated: March 17, 2020, 9:12 PM IST
దండం పెడుతున్నా..బయటకు రావొద్దు.. కరోనాపై కలెక్టర్ విజ్ఞప్తి
చేతులెత్తి నమస్కరిస్తున్న జిల్లా కలెక్టర్
  • Share this:
కరోనావైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.  వ్యాధిని ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుచేసిన అనుమానితులకు చికిత్స అందజేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేసి వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో ప్రచారం చేయిస్తోంది. ఐతే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాత్రం ప్రజలకు దండంపెట్టి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కరోనా వ్యాధిని కట్టడిచేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నారు.

కరోనా కట్టడికి సహకరించండి. 14 రోజులు అత్యంత కీలకం. పట్టణ ప్రజలు నిర్లక్ష్యం వీడండి. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరుణ వైరస్ సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. చేతులెత్తి దండం పెడుతున్నా. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండండి.
కృష్ణ భాస్కర్


జిల్లా ప్రజలకు కరోనా వైరస్ రాకుండా ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గత వారం రోజుల నుంచి కరోనా వైరస్ ప్రబలకుండా చూసేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. సిరిసిల్ల సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, మున్సిపల్ కమిషనర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

కాగా, తెలంగాణలో ఇఫ్పటి వరకు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో మహేంద్రహిల్స్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇప్పటికే కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. మరో నలుగురు మాత్రం గాంధీ ఆస్పత్రిలో పొందుతున్నారు. ఐతే వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని.. అక్కడి నుంచి కరోనాను వెంటపెట్టుకొచ్చారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అంతేతప్ప తెలంగాణలో ఉంటున్న ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
First published: March 17, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading