హైదరాబాద్‌లో కరోనా బాధితుడి ఇంట్లో చోరీ.. ఆస్పత్రి నుంచి వచ్చేసరికి..

హైదరాబాద్‌లో కరోనా బాధితుడి ఇంట్లో చోరీ.. ఆస్పత్రి నుంచి వచ్చేసరికి..

రాయదుర్గం ఎస్ఆర్ హిల్స్‌లో మరో భారీ చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్. కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో రూ. 15 లక్షలు, బంగారం చోరీ.

ఇటీవలే పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగొచ్చారు. ఐతే వారు వెళ్లేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే.. సామానంతా చిందర వందరగా ఉంది. అక్కడి వాతావరణ చూసి ఇంట్లో దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చారు.

  • Share this:
    హైదరాబాద్‌లో కరోనా బాధితుడి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. దొంగలు ఆయన ఇంటికి కన్నం వేసి.. అంతా దోచుకెళ్లారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ ప్రగతిశీల కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి కరోనా సోకింది. ఏప్రిల్ 11న ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. అటు భార్యా,పిల్లలన్ని కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఇటీవలే పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగొచ్చారు. ఐతే వారు వెళ్లేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే.. సామానంతా చిందర వందరగా ఉంది. అక్కడి వాతావరణ చూసి ఇంట్లో దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. బీరువాని బద్దలుకొట్టి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదను దొంగు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు