తెలంగాణలో కరోనా రికవరీ రేటు 99శాతం..అందరూ కోలుకుంటున్నారు..

తెలంగాణలో ఇప్పటి వరకు 37,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 24,840 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 375 మంది మరణించారు.

news18-telugu
Updated: July 15, 2020, 6:40 AM IST
తెలంగాణలో కరోనా రికవరీ రేటు 99శాతం..అందరూ కోలుకుంటున్నారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా బాధితులంతా కోలుకుంటున్నారని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99శాతంగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరణాల శాతం కూడా తక్కువగా ఉందని ఆయన చెప్పారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.7గా ఉంటే.. తెలంగాణలో ఒక్కశాతం మాత్రమే ఉందని వెల్లడించారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాతే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు శ్రీనివాసరావు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

తెలంగాణలో ఉన్న కరోనా బాధితులలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 9,786 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. గత ఐదు రోజులుగా తెలంగాణలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచామని... జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 30 ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 54 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కొనసాగుతుందని శ్రీనివాస్ రావు అన్నారు. కరోనా చికిత్స విషయంలో డీ సెంట్రలైజ్‌ చేశామన్న ఆయన.. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా కరోనా చికిత్స ఉచితంగా జరగనుందని తెలిపారు.

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 37,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 24,840 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 375 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,531 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం వరకు 1,95,024 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 6:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading