news18-telugu
Updated: July 11, 2020, 2:45 PM IST
ప్రతీకాత్మక చిత్రం
(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్18)
కరోనా వైరస్. పేరు వింటేనే వణికిపోతున్న పరిస్థితి. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ వైరస్ బారిన పడి లక్షలాది మంది పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య గడచిన పదిరోజులలో గణనీయమైన సంఖ్యలో పెరుగుతూ వస్తోంది. గడచిన మూణ్నెళ్లలో ఎన్ని కేసులు నమోదయ్యాయో.. కేవలం ఈ పదిరోజులలో అన్ని కేసులు రికార్డయ్యాయి. శాంపిళ్లు తీసి, టెస్టుల సంఖ్య పెరిగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే పరిస్థితి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం ఇస్తున్నామని చెబుతూ ఉంది. అయితే అక్కడ పద్దెనిమిది రోజులు చికిత్స పొంది, వైరస్ను జయించి తిరిగొచ్చి తన రోజవారీ జీవితాన్ని సాఫీగా గడుపుతున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ గిరిజన సామాజిక కార్యకర్త భద్రూనాయక్ను 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి ముఖాముఖి మాట్లాడగా వ్యాధి నిర్ధరణ మొదలు, చికిత్స, ఆసుపత్రిలో సౌకర్యాలు, వైద్యుల ఆదరణ, అధికారుల స్పందన, తిరిగొచ్చాక తోటివారి స్పందన తదితర అంశాలపై భద్రూనాయక్ కూలంకుషంగా 'న్యూస్18 తెలుగు'కు వివరించారు. వ్యాధి తీవ్రత, అవగాహన లేమితో ఇంకా ప్రజానీకం ఈ వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్ష చూపడం పట్ల భద్రూనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224. కరోనా మృతుల సంఖ్య 339.. తెలంగాణలో నిన్న 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 151109 కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో 118885 మందికి నెగిటివ్ వచ్చింది. 32224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,680 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 19205 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 11, 2020, 2:42 PM IST