హైదరాబాద్‌లో కరోనా యాంటిజెన్ టెస్ట్‌లు ప్రారంభం.. 15 నిమిషాల్లో రిపోర్ట్

హైదరాబాద్‌తో పాటు అత్యధిక కేసులు నమోదవుతున్న ఇతర జిల్లాల్లోనూ రాబోయే రోజుల్లో యాంటిజెన్ పరీక్షలు చేస్తామని వెల్లడించాయి.

news18-telugu
Updated: July 9, 2020, 6:23 AM IST
హైదరాబాద్‌లో కరోనా యాంటిజెన్ టెస్ట్‌లు ప్రారంభం.. 15 నిమిషాల్లో రిపోర్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజుకు 1,500లకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర పరిధిలో కరోనా టెస్ట్‌లను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. బుధవారం నుంచి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌తో పాటు అత్యధిక కేసులు నమోదవుతున్న ఇతర జిల్లాల్లోనూ రాబోయే రోజుల్లో యాంటిజెన్ పరీక్షలు చేస్తామని వెల్లడించాయి.

మొదటి దశలో తెలంగాణలో 50 వేల వరకు యాంటిజెన్‌ టెస్టులు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. ప్రస్తుతం కోవిడ్-19 నిర్ధారణకు RT-PCR (రియల్ టైమ్ పాలిమెరేజ్ చైన్ రియాక్షన్) విధానంలో పరీక్షలు చేస్తున్నారు. ఐతే దీనికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఒక్కో RT-PCR ధర రూ.2500. ఈ విధానంలో పరీక్షలు చేయాలంటే శాంపిల్స్‌ను ప్రత్యేకమైన ద్రావణంలో నిల్వ చేయడంతో పాటు ప్రత్యేకమైన కిట్‌లో రవాణా చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఖర్చు మరింత పెరుగుతుంది.

అదే స్టాండర్డ్ క్యూ కోవిడ్ 19 ఏజీ డిటెక్షన్ కిట్‌‌ రూ.500 మాత్రమే లభిస్తుంది. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాబ్లోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పరీక్షలు చేయవచ్చు. యాంటిజెన్ టెస్టులో ఫలితం పాజిటివ్‌ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. నెగెటివ్‌ వస్తే మాత్రం ఆర్‌టీ–పీసీఆర్‌ పద్దతిలో మరోసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. పాజిటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 99.3 నుండి 100 శాతం ఉంటుంది. అదే నెగెటివ్ వస్తే కచ్చితత్వం 50 నుంచి 70 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇందులో ఇదే ప్రధాన లోపం.

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 29,536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 17,279 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 324 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 11,933 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,34,801 కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 6:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading