తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సోకడం మొదలయ్యింది. గత రెండు రోజులుగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. మంత్రి ఈటల రాజేందర్ దగ్గర ఓఎస్డీ గంగాధర్‌కు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిన్న మొన్నటి వరకు మంత్రితోనే ఆయన తిరిగారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఒక మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. అంతే కాకుండా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సహాయకుడికి కరోనా సోకింది. ఇప్పుడు తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికార పార్టీలో కొంతమేర కలవరం మొదలయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Covid-19, Eetala rajender