ఇండియాలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు రోజుకు 5 వేల కేసులు నమోదవుతూ ఉండగా, గత 24 గంటల్లో ఏకంగా ఆరు వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం.. మొత్తం 1,18,447 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6088 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 66,331 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 48,533 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అటు.. 3583 మంది వైరస్ సోకి మరణించారు. నిన్న ఒక్క రోజే 148 మంది మృతి చెందారు. అటు.. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 41,642, తమిళనాడులో 13967, గుజరాత్లో 12905, ఢిల్లీలో 11659, రాజస్థాన్లో 6227, మధ్యప్రదేశ్లో 5981, ఉత్తరప్రదేశ్లో 5515, పశ్చిమ బెంగాల్లో 3197, ఆంధ్రప్రదేశ్లో 2647, పంజాబ్లో 2028, బిహార్లో 1982, తెలంగాణలో 1699 కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసుల వివరాలు ఇవీ..
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.