news18-telugu
Updated: June 4, 2020, 5:12 PM IST
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం సమీపంలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. సీఎం జగన్ నివాసం ఉండే సమీపంలో క్రిస్టియన్ పేట, ఎన్టీఆర్ కట్టపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లే దారిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ ఎత్తున శానిటైజేషన్ చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ క్లీన్ చేస్తున్నారు. తాడేపల్లి మండలం పరిధిలో ఉండవల్లి గ్రామంలో మరో పాజిటివ్ కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి ఉండే ప్రాంతంలో ఇన్ని కేసులు ఉండడంతో అధికారులు హడలిపోతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
First published:
June 4, 2020, 5:03 PM IST