మాస్క్ ఏదని అడినందుకు.. పోలీసులను చితకబాదిన గ్యాంగ్

మాస్క్ ఏదని ప్రశ్నించినందుకు.. పోలీసులపై కొందరు దండగులు దాడిచేశారు. పదునైన ఆయుధాలతో చితకబాదారు.

news18-telugu
Updated: May 15, 2020, 4:37 PM IST
మాస్క్ ఏదని అడినందుకు.. పోలీసులను చితకబాదిన గ్యాంగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్‌ను ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. ఐతే ఇప్పటికీ కొందరు మాస్క్ ధరించకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారిని పోలీసులు ప్రశ్నించినప్పుడు.. ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మాస్క్ ఏదని ప్రశ్నించినందుకు.. పోలీసులపై కొందరు దండగులు దాడిచేశారు. పదునైన ఆయుధాలతో చితకబాదారు.

గురువారం అంటాప్ హిల్ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించే వారిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మాస్క్ లేకుండా కనిపించారు. మాస్క్ తప్పనిసరి కదా.. మరి ఎందుకు ధరించలేదని నిలదీశారు. దాంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. అనంతరం కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


గురువారం రాత్రి మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1602 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 44 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 27,524కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6059 మంది కోలుకోగా.. 1019 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,441 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే
First published: May 15, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading