సౌతాఫ్రికా (South Africa) కేంద్రంగా ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ (Omicron corona variant: విజృంభిస్తుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. అక్కడి నుంచి ఇతర దేశాలకు వ్యాపిస్తుండడంతో ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు సౌతాఫ్రికాకు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ఒమిక్రాన్ వేరియెంట్ అత్యంత భయంకరమై వైరస్ అని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో.. ప్రధాని నరేంద్ర మోదీ (pm Narendra Modi Review Meeting) శనివారం కీలక భేటీ నిర్వహించారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) వీకే పాల్ హాజరయ్యారు. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త వేరియెంట్ వణికిస్తున్న వేళ నిజంగా ఊరటే
PM Narendra Modi chairs meeting with top govt officials on COVID-19 situation & vaccination; Cabinet Secretary Rajiv Gauba, Principal Secretary to PM, PK Mishra, Union Health Secretary Rajesh Bhushan & NITI Aayog member (health) Dr VK Paul are among the attendees
(Photo: PMO) pic.twitter.com/u4keTTDlwx
— ANI (@ANI) November 27, 2021
అమెరికాకు బుద్ధి చెప్పేలా మోదీ మంత్రాంగం -డిసెంబర్ 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక
ఒమిక్రాన్ వేరియెంట్ వెలుగుచూసిన దేశాల నుంచి విమానరాకపోకలను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆయా దేశాల నుంచి భారత్‌లోకి వైరస్ ప్రవేశించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే సౌతాఫ్రికాకు పలు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. తాజాగా శ్రీలంక సైతం ఈ ఆరు దేశాలకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆస్పత్రులకు వెళుతున్నారా? -ఇవాళ్టి నుంచి చిన్న డాక్టర్లు ఉండరు మరి -Resident doctors strike
కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్ .. ఆ తర్వాత పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజరీ సమావేశమయింది. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించింది. అంతేకాదు ఈ కొత్త వేరియెంట్‌కు 'ఒమిక్రాన్' అని పేరుపెట్టింది. అది ఇప్పటి వరకు వచ్చిన కరోనా వేరియెంట్‌లలో కెల్ల అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని దేశాలూ అప్రమత్తమవుతున్నాయి. వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Omicron corona variant, PM Narendra Modi