బ్రిటన్ ప్రధానికి కరోనావైరస్.. నరేంద్ర మోదీ స్పెషల్ ట్వీట్

యూకేలో ఇప్పటి వరకు 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకోగా.. 578 మంది చనిపోయారు.

news18-telugu
Updated: March 27, 2020, 6:36 PM IST
బ్రిటన్ ప్రధానికి కరోనావైరస్.. నరేంద్ర మోదీ స్పెషల్ ట్వీట్
నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్
  • Share this:
యూరప్‌లో కరోనావైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకేలపై పంజా విసురుతోంది. కోవిడ్-19 మహమ్మారి ధాటికి అక్కడి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. సామాన్య ప్రజలు, డాక్టర్లతో పాటు మంత్రులు, దేశాధినేతలు సైతం కోవిడ్-19 బారినపడుతున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా కరోనా వైరస్ సోకడ.. యూకే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్‌ను ఉద్దేశించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మీరు పోరాట యోధులని.. కరోనా మహమ్మారిని కూడా జయిస్తారని పేర్కొన్నారు మోదీ. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని.. యూకే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ (55)కు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారని.. ఐతే పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంటి నుంచే పరిపాలన చేస్తున్నారని.. చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఇక తనకు కరోసా సోకిందన్న విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సన్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు.

యూకేలో ఇప్పటి వరకు 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకోగా.. 578 మంది చనిపోయారు. ప్రస్తుతం 4,665 యాక్టివ్ కరోనా కేసులున్నాయని.. అందులో 163 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని యూకే వైద్యాధికారులు తెలిపారు. ఐతే ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధాన మంత్రికి కూడా కరోనా సోకడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: March 27, 2020, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading