హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

కేంద్ర హోంశాఖ అన్ లాక్ 3 గైడ్ లైన్స్ జారీ చేసింది.

కేంద్ర హోంశాఖ అన్ లాక్ 3 గైడ్ లైన్స్ జారీ చేసింది.

ఇప్పటికే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని.. రేపోమాపో అధికారిక ప్రకటన వస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.

భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజుకు 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా పంజా విసురుతున్నందున.. మళ్లీ లాక్‌డౌన్ విధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జూన్ 15 నుంచి మళ్లీ దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని.. రేపోమాపో అధికారిక ప్రకటన వస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. విమానాలు, రైలు ప్రయాణాలపైనా నిషేధం విధిస్తారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.


కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 276583కి చేరింది. మరో 279 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7745కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 5991 మంది కోలుకున్నారు. అందువల్ల కోలుకున్న వారి సంఖ్య 135205కి చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఆరో స్థానంలో ఉంది.

First published:

Tags: Coronavirus, Covid, Lockdown, Lockdown relaxations

ఉత్తమ కథలు