ఇండిగో విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్

అప్రమత్తమైన ఇండిగో సంస్థ తమ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపింది. ఆ విమానంలో ప్రయాణించిన వారి వివరాలను సేకరించి అధికారులకు సమాచారం అందించారు.

news18-telugu
Updated: May 26, 2020, 9:25 PM IST
ఇండిగో విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోమవారం నుంచే దేశీయ విమానాలు రాకపోకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐతే నిన్న తమిళనాడులో ఇండిగో విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా సోకినట్లు ఇవాళ నిర్ధారణ అయింది. చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్లిన ప్రయాణికుడికి కోరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఇండియా సంస్థకు కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు డాక్టర్ సమాచారం ఇచ్చారు. దాంతో అప్రమత్తమైన ఇండిగో సంస్థ తమ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపింది. ఆ విమానంలో ప్రయాణించిన వారి వివరాలను సేకరించి అధికారులకు సమాచారం అందించారు.

కాగా, తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ 611 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 9 మంది మరణించారు. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,728కి చేరింది. వీరిలో కరోనా వైరస్‌తో పోరాడుతూ 9,342 మంది కోలుకోగా.. 127 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,256 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
First published: May 26, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading