కరోనా వైరస్ పోరాటానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలుస్తోంది భారతీయ రైల్వే. నాన్ ఏసీ ప్యాసింజర్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తోంది. భారతీయ రైల్వే 5,000 నాన్ ఏసీ కోచ్‌లను 80,000 ఐసోలేషన్ వార్డులుగా మార్చే పనిలో ఉంది. అందులో భాగంగా సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే 486 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేసింది. తెలంగాణలోని లాలాగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వర్క్‌షాప్స్ సాయంతో ఈ టార్గెట్ పూర్తి చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ డివిజన్లో 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్లో 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్లో 50 కోచ్‌లు, గుంతకల్ డివిజన్లో 61 కోచ్‌లు, నాందేడ్ డివిజన్లో 30 కోచ్‌లు, గుంటూర్ డివిజన్లో 25 కోచ్‌లు, లాలాగూడ వర్క్‌షాప్‌లో 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్‌లో 84 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేసింది.
అత్యవసరమైతే 20,000 కోచ్‌లను 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌గా మార్చాలని టార్గెట్‌గా పెట్టుకుంది భారతీయ రైల్వే. అందులో భాగంగా మొదట 5,000 కోచ్‌లను 80,000 వార్డులుగా మారుస్తోంది. దక్షిణ మధ్య రైల్వేకు 486 కోచ్‌లను కేటాయించింది. ప్రతీ కోచ్‌లో 16 ఐసోలేషన్ వార్డులు ఉంటాయి. అంటే దక్షిణ మధ్య రైల్వే మొత్తం 7,776 ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది. అవసరాన్ని బట్టి వీటిని కరోనా వైరస్ సోకిన పేషెంట్ల కోసం వాడుకోనుంది. ప్రతీ నాన్ ఏసీ కోచ్‌లో 9 కూప్స్, 1 బాత్రూమ్, 3 టాయిలెట్స్ ఉంటాయి. ఒక కూప్‌ను మెడికల్ సిబ్బంది కోసం ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి:
Loan: రూపాయి వడ్డీకే లోన్... ఎవరు తీసుకోవచ్చంటే
Personal Loans: కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు
Gold Price: రెండు రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం... తులం ఎంతంటేPublished by:Santhosh Kumar S
First published:April 23, 2020, 17:35 IST