కరోనా వైరస్ స్టాక్ మార్కెట్లను దెబ్బమీద దెబ్బ కొడుతోంది. మార్కెట్లు మరోసారి దారుణంగా పతనమయ్యాయి. నిఫ్టీ ఏకంగా 8000 పాయింట్లకు దిగువన ఓపెన్ అయింది. నిఫ్టీ 8.66% అంటే 757.05 పాయింట్లు పతనమై 7988.40 దగ్గర ఓపెన్ అయింది. సెన్సెక్స్ 8.77% అంటే 2,624.69 పాయింట్లు పతనమై
27291.27 పాయింట్ల దగ్గర ఓపెన్ అయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు పెరుగుతుండటం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రభావం ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్‌కు ఆదేశించడంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో షేర్లు అమ్మేందుకు పోటీపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా పడిపోయాయి.
భారతీయ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా ఉంది. ఒక్క జపాన్ మార్కెట్ తప్ప ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ కావడం భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో బెయిల్ అవుట్ ప్యాకేజీకి ఆమెదముద్ర పడకపోవడంతో డోజౌన్స్ ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉంది. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 27482 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 8049 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
IRCTC: రైలు టికెట్ బుక్ చేసినవారికి ఊరట... ఈ రూల్స్ మారాయి
Reliance Jio: గుడ్ న్యూస్... జియో యూజర్లకు డబుల్ డేటా
Good News: ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Nifty, Sensex, Stock Market