Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS PANDEMIC RESERVE BANK OF INDIA RBI CUTS REPO RATE BY 75 BPS HUGE IMPACT ON EMIS SS

Breaking News: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ఈఎంఐలు

Breaking News: రుణాలు తీసుకున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ఈఎంఐలు
(ప్రతీకాత్మక చిత్రం)

Breaking News: రుణాలు తీసుకున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ఈఎంఐలు (ప్రతీకాత్మక చిత్రం)

RBI cuts Repo Rat | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఆరుసార్లు మొత్తం కలిపితే 210 బేసిస్ పాయింట్స్ తగ్గింది.

    రుణాలు తీసుకున్నవారికి, లోన్స్ తీసుకోవాలని అనుకుంటున్నవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను భారీగా తగ్గించింది. కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించినట్టు ప్రకటించారు. దీంతో రెపో రేట్ 4.4 శాతానికి చేరుకుంది. ఒకేసారి 75 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కీలక నిర్ణయమే. సామాన్యులకు రుణ భారం భారీగా తగ్గనుంది. ఇంతకు ముందు రెపో రేట్ 5.15 శాతంగా ఉండేది.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఆరుసార్లు మొత్తం కలిపితే 210 బేసిస్ పాయింట్స్ తగ్గింది. అంటే వడ్డీ 2.10 శాతం తగ్గినట్టే. ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది. కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది.

    కరోనా వైరస్ ప్రభావం, దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అన్ని వర్గాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం 'పీఎం గరీబ్ కళ్యాణ్' పేరుతో ఓ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రూ.1,70,000 కోట్లు ఖర్చు చేయనుంది.

    ఇవి కూడా చదవండి:

    PM Gareeb Kalyan: పీఎం గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌తో లాభాలు వీళ్లకే

    ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...

    Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు డబ్బులు లేవా? ఇలా చేయండి
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loans, Corona, Corona virus, Coronavirus, Covid-19, Home loan, Housing Loans, Lockdown, Personal Loan, Rbi, Rbi governor, Repo rate, Reserve Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు