Repo Rate Cut | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఏడోసారి. ఏడుసార్లు మొత్తం కలిపితే 250 బేసిస్ పాయింట్స్ తగ్గింది. అంటే వడ్డీ 2.50 శాతం తగ్గినట్టే.
బ్యాంకులో లోన్లు తీసుకున్నవారికి, కొత్తగా రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్‌ను భారీగా తగ్గించింది. రెపో రేట్‌ను ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో రెపో రేట్ 4.4 శాతం నుంచి 4 శాతానికి దిగి వచ్చింది. గత నెలలో ఆర్‌బీఐ రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. ఆర్‌బీఐ రెపో రేట్‌ను తగ్గించడంతో సామాన్యులకు రుణ భారం భారీగా తగ్గనుంది. మరోవైపు రివర్స్ రెపో రేట్‌ను 3.35 శాతానికి తగ్గించింది ఆర్‌బీఐ.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఏడోసారి. ఏడుసార్లు మొత్తం కలిపితే 250 బేసిస్ పాయింట్స్ తగ్గింది. అంటే వడ్డీ 2.50 శాతం తగ్గినట్టే. ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది. కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.